Memantha Siddham Day-6: YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. అన్నమయ్య జిల్లాలో 6వ రోజు హైలెట్స్!

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. అన్నమయ్య జిల్లాలో 6వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-6: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర మంగళవారం ఆరో రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-6: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర మంగళవారం ఆరో రోజు అన్నమయ్య జిల్లాలో కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ చేపట్టిన ఈ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  ఇప్పటికే  కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాలో ఈ బస్సుయాత్ర పూరైంది. మంగళవారం ఆరో రోజు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఆరవ రోజు కొనసాగుతోంది. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మంగళవారం 6వ రోజు బస్సుయాత్ర చీకటిమనిపల్లె నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర  నుంచి ప్రారంభమైంది. ములకల చెరువు, పెద పాలెం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ల వరకు ఈయాత్ర కొనసాగింది.  మదనపల్లెలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం రాత్రికి అమ్మగారి పల్లెలో సీఎం జగన్ బస చేయనున్నారు. ఆరో రోజు యాత్ర అన్నమయ్య జిల్లాలో కొనసాగింది. దారిపొడవునా  సీఎం జగన్ కు ప్రజానీకం ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక యాత్రలో భాగంగా ములకల చెరువు వద్ద సీఎం జగన్ కి స్థానికులు ఘనస్వాగతం పలికారు.

చీకటి మునిపల్లి  స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు వైసీపీలోచేరారు. మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్ వైసీపీలో చేరారు. ఇక వేపూరి కోట క్రాస్ వద్ద సీఎం జగన్ కి భారీ స్వాగతం పలికారు. ఆయనపై చిన్నారులు పూల వర్షం కురిపించి. ఆ చిన్నారులతో సీఎం జగన్ ముచ్చటించారు. ఇక ఈ బస్సుయాత్రలో ప్రజలను కలుసుకున్న సీఎం జగన్ వారి సమస్యలను ఉన్నారు. అంతేకాక నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. ఇక అన్నయయ్య జిల్లాలోని అంగళ్ల ప్రాంతానికి చేరుకున్న సీఎం జగన్ కి భారీ సంఖ్యలో  ప్రజలు స్వాగతం పలికారు.

పెత్తందారులపై పోరుకు మేమంతా సిద్ధం అని అక్కడి ప్రజలు నినాదాలు చేశారు. ఇదే సమయంలో ప్రజలతో మమేకవుతున్న సీఎం జగన్ నేనున్నానంటూ భరోసా కల్పించారు. మదనపల్లిలో భారీ బహిరంగ సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, చోడేపల్లి మీదుగా అమ్మగారి పల్లెకు చేరుకుంటారు. అక్కడ రాత్రికి బస చేయనున్నారు. మొత్తంగా ఆరో రోజు సీఎం జగన్ బస్సుయాత్ర  అన్నమయ్య జిల్లాలో  విజయవంతంగా కొనసాగింది.

Show comments