YS Jagan, Chandrababu: చంద్రబాబుపై CM జగన్ మరో రికార్డ్!

YS Jagan, Chandrababu: చంద్రబాబుపై CM జగన్ మరో రికార్డ్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సృష్టించిన రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మరోసారి 2024 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుపై ఓ రికార్డు సాధించారు. మరి.. ఆ రికార్డ్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సృష్టించిన రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే మరోసారి 2024 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబుపై ఓ రికార్డు సాధించారు. మరి.. ఆ రికార్డ్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో ఉంది. కురుక్షేత్ర సంగ్రామానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇక్కడి రాజకీయం సాగుతోంది. అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాను ఒక్కడే ఒంటరిగా ప్రచారం చేస్తూ.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం జగన్. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి పార్టీలు అన్ని కలసీ  ప్రచారంలో చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే… ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఓ విషయంలో సీఎం జగన్ చంద్రబాబుపై రికార్టు సాధించారు. ఈ రికార్డుతో ఏపీ ప్రజలు సీఎం జగన్ వైపు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేశారు. అదే సమయంలో రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. ఇలా తన 58 నెలల పాలలనో ఎన్నో అద్భుతాలు, సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తన పరిపాలన గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. అలానే సీఎం అయిన తరువాత మొట్ట మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. బుధవారం ఓ న్యూస్ ఛానల్ కి సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతేకాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం వంటి అనేక విషయాల గురించి సీఎం జగన్ క్లియర్ కట్ గా చెప్పారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానంటూ, మరోసారి విజయం తమదేనని స్పష్టం చేశారు. జూన్ 4 తరువాత సీఎం గా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన తెలిపారు.

ఇక ఇదే ఇంటర్వ్యూతో సీఎం జగన్..చంద్రబాబుపై రికార్డు సాధించారు. అది ఎలా అంటే.. సీఎం జగన్  ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన రోజే.. మరో న్యూస్ ఛానల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ కూడా ప్రచారం అయింది.  ఇలా సేమ్ టైమ్ లో వీరిద్దరి ఇంటర్వ్యూలు ప్రసారం కాగా.. సీఎం జగన్ వీడియోనే ఎక్కువ మంది చూశారు. సదరు న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన టెలికాస్ట్ లో ఏకంగా 63,000 మంది వీక్షించారు. అలానే సీఎం జగన్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రత్యేక లింక్ లో  23,000 వీక్షించారు. మొత్తంగా 86 వేల మంది సీఎం జగన్ ఇంటర్వ్యూను వీక్షించించారు.

ఇదే సమయంలో చంద్రబాబుకు సంబంధించిన ఇంటర్వ్యూ చూసినట్లు అయితే.. ఒక దానిలో 21 వేల మంది, డైరెక్ట్ లింక్ లో 7 వేల మంది మాత్రమే వీక్షించారు. ఇలా ఇద్దరు అధినేతలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఒకేసారి రావడం తొలిసారి. అందులోనూ ఇందులో కూడా చంద్రబాబుపై సీఎం జగన్ రికార్డు క్రియేట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం జగన్ చెప్పే మాటలపై నమ్మకం ఉంది కాబట్టే ప్రజలు ఆయనకు సంబంధించిన వీడియోను ఎక్కువగా వీక్షించారని పొలిటికల్  ఎనలిస్ట్ లు భావిస్తున్నారు. మరి.. ఈ ఇంటర్వ్యూలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments