భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ ఊర మాస్ పర్ఫార్మెన్స్!

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ ఊర మాస్ పర్ఫార్మెన్స్!

భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్.. మెగాస్టార్ ఊర మాస్ పర్ఫార్మెన్స్!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భోళా శంకర్ ట్రైలర్ రానే వచ్చేసింది. చిరంజీవి సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. పోస్టర్, టీజర్, సాంగ్స్ అంటూ ఇప్పటి వరకు అలరించిన చిత్ర బృందం.. ట్రైలర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి ఈ మూవీలో అటు మాస్ కి తోడుగా క్లాస్ ని కూడా కలిపేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మెహెర్ రమేశ్ గట్టిగానే ప్లాన్ చేశాడని అనిపించక మానదు.

ఎందుకంటే ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ని టచ్ చేయడమే కాకుండా చాలా బలంగా చూపించినట్లు కనిపిస్తోంది. ఒక సోషల్ కాజ్ తో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలా ఉంది. ఈ ట్రైలర్ మొత్తం మెగాస్టార్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసేదిగా ఉంది. ఉమెన్ ట్రాఫికింగ్ తో ట్రైలర్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి పాత్రను పరిచయం చేస్తూ.. ఆయన శత్రువులు, కుటుంబం, ప్రేమ ఇలా ఒక్కో ఎలిమెంట్ ని టచ్ చేస్తూ ట్రైలర్ కట్ చేశారు. కలకత్తా నుంచి మొదలు పెట్టి హైదరాబాద్ దాకా, పోలీసులు మొదలు మాఫియా దాకా అన్నీ అంశాలు ఈ మూవీలో కనిపిస్తున్నాయి.

ఇంక పాటలు, చిరు, తమన్నా, కీర్తీ సురేష్ డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంక అటు కమెడియన్లు, ఇటు సపోర్టింగ్ యాక్టర్స్ కి అయితే కొదవే లేదు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, గెటప్ శ్రీను, శ్రీముఖి, రష్మీ ఇలా చాలా మందే ఉన్నారు. మొత్తానికి చిరంజీవి– మెహెర్ రమేష్ కాంబో గట్టిగానే కొట్టేలా కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా తరహాలోనే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, మాఫియా బ్యాగ్రౌండ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. భోళా శంకర్ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

Show comments