Chaari 111 Movie Review in Telugu: చారి 111 మూవీ రివ్యూ.. వెన్నెల కిశోర్ ప్రయత్నం ఫలించిందా?

చారి 111 మూవీ రివ్యూ.. వెన్నెల కిశోర్ ప్రయత్నం ఫలించిందా?

కమెడియన్ వెన్నెల కిశోర్ తనలో ఉన్న హీరోని చూపించడానికి 'చారి 111' సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి హీరోగా వెన్నెల కిశోర్ మెప్పించాడా? అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కమెడియన్ వెన్నెల కిశోర్ తనలో ఉన్న హీరోని చూపించడానికి 'చారి 111' సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి హీరోగా వెన్నెల కిశోర్ మెప్పించాడా? అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

చారి 111

20240301,
కామెడీ డ్రామా
  • నటినటులు:వెన్నెల కిశోర్, సంయుక్త, మురళీ శర్మ, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ తదితరులు.
  • దర్శకత్వం:టీజీ కీర్తి కుమార్
  • నిర్మాత:అదితి సోని
  • సంగీతం:సైమన్ కే కింగ్
  • సినిమాటోగ్రఫీ:కాశిశ్ గ్రోవర్

2

చిత్ర సీమలో కమెడియన్లు హీరోలుగా మారడం ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్. కానీ అందులో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మానందం, ప్రియదర్శి లాంటి హాస్య నటులు హీరోగా తెరపై కనిపించిన సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్ సైతం తనలో ఉన్న హీరోని చూపించడానికి ‘చారి 111’ సినిమాతో మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి హీరోగా వెన్నెల కిశోర్ మెప్పించాడా? అతడి ప్రయత్నం ఫలించిందా? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్ టీమ్ ను మేజర్ ప్రసాద్ రావు(మురళీ శర్మ) నడిపిస్తూ ఉంటారు. దేశ భద్రత కోసం ఈ టీమ్ వర్క్ చేస్తుంటుంది. అయితే ఒకసారి హైదరాబాద్ లో సూసైడల్ బాంబ్ అటాక్ జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి దగ్గర చిన్న క్లూ కూడా దొరకదు. ఈ కేసును రుద్రనేత్ర టీమ్ కు అప్పగిస్తారు. దానికి ఏజెంట్ చారి 111(వెన్నెల కిశోర్) నాయకత్వం వహిస్తాడు. ఈ మిషన్ లో ఈషా(సంయుక్త) పాత్ర ఏంటి? బ్లాస్టింగ్ లో ఉపయోగించిన కెమికల్ పిల్ ఏంటి? చివరికి చారి తన మిషన్ ను కంప్లీట్ చేశాడా? లేదా? ఈ క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

సీక్రెట్ ఏజెంట్ మూవీస్ అనగానే మనందరికి గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు జేమ్స్ బాండ్. ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సీక్రెట్ ఏజెంట్ కోవలో పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. తాజాగా స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన ‘చారి 111’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా వెన్నెల కిశోర్ సినిమా అనగానే అందరూ కామెడీనే ఆశిస్తారు. ఈ సినిమాలో కూడా కావాల్సినంత అది దొరుకుతుందని వెళ్లిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. ఎందుకంటే? ఈ మూవీలో లాజిక్ లేని కామెడీ ఉంటుంది.. కానీ నవ్వు రాదు. జాతిరత్నాలు సినిమాకు వర్కౌట్ అయిన పంచింగ్ కామెడీ అన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుందనుకుంటే.. అది పొరపాటే అవుతుంది. ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది.

మిషన్ అప్పగించినప్పటి నుంచి వెన్నెల కిశోర్ చేసేది హీరో పాత్రనా? లేక కమెడియన్ పాత్రనా? అన్న అనుమానం వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియని హీరోకి ఓ కీలక మిషన్ అప్పగిస్తే ఎలా ఉంటుంది? డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్ ఆలోచన మెచ్చుకోదగ్గదే. ఎందుకంటే? వెన్నెల కిశోర్ లాంటి కమెడియన్ ను ఏజెంట్ గా ఊహించుకుని కథ రాసుకున్నాడు. కానీ దాన్ని ఆచరణలో పెట్టడంలో పూర్తిగా విఫలమైయ్యాడు. కథ, కథనం సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. లాజిక్స్ లేకుండా వచ్చిపోయే పాత్రలతో, అసలేం జరుగుతుందో కూడా అర్ధం కాకుండానే ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ లోనైనా కాస్త నవ్వుకుందాం అనుకున్న ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాడు డైరెక్టర్. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

నటీ, నటుల పనితీరు:

వెన్నెల కిశోర్ తన పాత్రక వందకు వంద శాతం న్యాయం చేశాడు. తింగరి ఏజెంట్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ఏజెంట్ ఈషాగా సంయుక్త అందంగా కనిపించింది. మురళీ శర్మ ఎప్పటిలాగే తన పాత్రలో జీవించేశాడు. అతడు చెప్పే కొన్ని డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. బ్రహ్మాజీ, సత్య, తాగుబోతు రమేష్ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. విలన్ పాత్ర గుర్తుపెట్టుకునే విధంగా లేదనే చెప్పాలి. ఇక ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే? అది బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. సైమన్ కే కింగ్ ఇచ్చిన బీజీఎం అద్భుతం. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

బలాలు

  • వెన్నెల కిశోర్
  • బీజీఎం

బలహీనతలు

  • కథ
  • కథనం
  • ల్యాగ్ సీన్లు
  • లాజిక్ లేని కామెడీ

చివరి మాట: చారి 111 మిషన్ ఫెయిల్ అయ్యింది.

(గమనిక): ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ఇదికూడా చదవండి: Operation Valentine Review in Telugu: ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ

Show comments