Central Govt-Airtel Alert Message: అలర్ట్‌ మెసేజ్‌లపై స్పందించిన కేంద్రం.. ఏమన్నదంటే

అలర్ట్‌ మెసేజ్‌లపై స్పందించిన కేంద్రం.. ఏమన్నదంటే

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు గురువారం ఉదయం 11-12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అలెర్ట్‌ మెసేజ్‌ రావడం కలకలం రేపింది. ఫోన్లకు ఒక్కసారిగా అలర్ట్‌ మెసేజ్‌, అలారమ్‌ సౌండ్‌ రావడంతో.. కస్టమర్లు ఆందోళనకు గురయ్యారు. అసలు ఈ మెసేజ్‌లు ఏంటి.. వీటి వల్ల ఏమైనా ప్రమాదమా అని ఆందోళన చెందుతున్నారు. దీని గురించి ఎవరిని కనుక్కోవాలో తెలియక కంగారు పడుతున్నారు. అయితే ఈ మెసేజ్‌లపై కేంద్రం వివరణ ఇచ్చింది. కేవలం టెస్టింగ్‌లో భాగంగానే.. ఈ మెసేజ్‌లను పంపిందని వెల్లడించింది.

ఈ అలర్ట్‌పై కేంద్ర వివరణ ఇస్తూ.. ఇలా ప్రకటన చేసింది. ‘‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్‌ విభాగ, సెల్‌ ప్రసారం సిస్టమ్‌ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి.. దీని గురించి ఎవరు ఆందోళన చేందవద్దు. కేంద్రం తాజాగా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌ను సిద్ధం చేసింది. విపత్తు సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు.. వారిని అలర్ట్‌ చేయడం కోసం ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీని టెస్టింగ్‌లో భాగంగా గురువారం ఉదయం జనాల మొబైల్స్‌కు అలర్ట్‌ మెసేజ్‌లు వచ్చాయి’’ అని వెల్లడించింది.

‘‘ఈ మెసేజ్‌లకు మీ వైపు నుంచి ఎలాంటి స్పందన, చర్య అవసరం లేదు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అమలు చేస్తోన్న ఈ అలర్ట్‌ మెసేజ్‌ సిస్టం.. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’’ అని కేంద్ర వివరణ ఇచ్చింది. నేడు మూడు భాషల్లో ఈ అలర్ట్‌ మెసేజ్‌ వచ్చింది. మొదట ఇంగ్లీష్‌, తర్వాత తెలుగు, హిందీ భాషల్లో ఈ మెసెజ్‌ వచ్చింది.

Show comments