Airtel యూజర్స్ కు సూపర్ రీఛార్జ్ ప్లాన్‌! ఉచితంగా నెట్‌ఫిక్స్!

Airtel యూజర్స్ కు సూపర్ రీఛార్జ్ ప్లాన్‌! ఉచితంగా నెట్‌ఫిక్స్!

ఇటీవల టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ లతో ఓటీటీలను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ టెల్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.

ఇటీవల టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ లతో ఓటీటీలను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్ టెల్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.

మీరు ఎయిర్ టెల్ యూజర్లా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. తాజాగా ఎయిర్ టెల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో మీరు ఏకంగా అన్ లిమిటెడ్ 5జీ డేటాతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ను ఉచింతంగా చూడొచ్చు. అంతే కాదు ఆ రీఛార్జ్ ప్లాన్ తో మరెన్నో ఆఫర్లను అందిస్తోంది ఎయిర్ టెల్. యూజర్లను ఆకర్షించేందుకు మార్కెట్ లో తమ ఉనికిని చాటేందుకు టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ లతో ఓటీటీలను చూసే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్ టెల్ కూడా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీలకు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ అందిస్తోంది. ఇప్పుడు కొత్త ప్లాన్ తో యూజర్లు నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్రీ గా పొందవచ్చు.

ఎయిర్ టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ఏంటంటే.. 1,499 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ తో యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. వాయిస్ కాల్స్‌(ఎస్టీడీ, రోమింగ్) అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. దీనిలో డైలీ 3జీబీ డేటా, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌తో లభించే ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో, ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, షోలను చూడవచ్చు. 5జీ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న ప్రాంతాలలో అధిక వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వీటితో పాటు అపోలో 24|7 సర్కిల్ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. అలాగే ఫ్రీ హలోట్యూన్స్‌ కూడా పొందవచ్చు. వింక్ మ్యూజిక్ ప్రీమియం కంటెంట్‌కు ఫ్రీగా యాక్సెస్ పొందవచ్చు. కాగా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న్యూ యూజర్లకు బేసిక్ ప్లాన్‌ను అందించడం లేదు. అయితే ఎయిర్‌ టెల్ కస్టమర్లు రూ. 1,499 రీఛార్జ్ ప్లాన్ ద్వారా బేసిక్ ప్లాన్‌ ప్రయోజనాన్ని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎయిర్ టెల్ కస్టమర్ లు అయితే వెంటనే ఈ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఫ్రీగా నెట్ ఫ్లిక్స్ ను చూసేయండి.

Show comments