Central Government Notifies CAA: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచే అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం!

CAA: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచే అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం!

లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

లోక్​సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పౌరసత్వ సవరణ చట్టం అమలు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మోడీ సర్కారు సోమవారం ఓ గెజిట్​ను విడుదల చేసింది. నేటి ఉదయం నుంచే కేంద్రం ఏదో కీలక నిర్ణయం తీసుకోనుందంటూ వార్తలు వచ్చాయి. అటు జాతీయ మీడియాతో పాటు ఇటు తెలుగు మీడియాలోనూ దీనిపై చాలా ఊహాగానాలు నడిచాయి. అయితే మొత్తానికి దీనికి తెరపడింది. సీఏఏను సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

సీఏఏ అంటే ఏంటి?
2019 డిసెంబర్ 11వ తేదీన లోక్​సభలో పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోదం లభించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘానిస్థాన్​కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ఉద్దేశం. 2014, డిసెంబర్ 31వ తేదీకి ముందు వలసవచ్చిన వారు అందుకు అర్హులు. పాక్, బంగ్లా, ఆఫ్ఘాన్​లో హింసకు గురై.. 2014కు ముందు భారత్​కు వచ్చిన వాళ్లందరికీ ఇక్కడి పౌరసత్వం వర్తించనుంది. హిందువులతో పాటు క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు ఇది వర్తించనుంది. వీళ్లకు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా ఒకవేళ ఉండి వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం 1995 నాటి పౌరసత్వ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం కాంట్రవర్సీగా మారింది.

ఇంత ఆలస్యం దేనికి?
సీఏఏ బిల్లును 2016లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టింది బీజేపీ. అయితే అప్పటి ఎన్డీయే మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. ఆ తర్వాత 2019లో పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టంగా మారింది. అయితే ఇన్నాళ్లూ దీన్ని అమలు పరచుకుండా వచ్చిన మోడీ ప్రభుత్వం.. అనూహ్యంగా లోక్​సభ ఎన్నికలు-2024కి ముందు దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సీఏఏకు సంబంధించిన కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం..

  • గడువు లోగా భారత్​కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు 6 ఏళ్ల లోపు పౌరసత్వం కల్పిస్తారు.
  • ఇండియాలో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలనే రూల్​ను 5 ఏళ్లకు తగ్గించారు.
  • పౌరసత్వం ఇచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.
  • పౌరసత్వం కోసం దరఖాస్తులను పూర్తిగా ఆన్​లైన్ విధానంలోనే స్వీకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధాలను కూడా ప్రకటించింది.
Show comments