రూ. 23 లక్షల విలువైన బంగారాన్ని రూ.2300 కే కొన్న కస్టమర్! ఎలా అంటే?

రూ. 23 లక్షల విలువైన బంగారాన్ని రూ.2300 కే కొన్న కస్టమర్! ఎలా అంటే?

సాధారణంగా ఆన్ లైన్ షాపింగ్ లో మనం కొనుగోలు చేసిన వస్తువులకు ఎక్కువ శాతం మోసాలు చేయడం, మోసపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. ఆన్ లైన్ షాపింగ్ లో జాక్ పాట్ ను కొట్టేశాడు. అదేంటి, ఆన్ లైన్ షాపింగ్, మోసాలు, ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టడం అంతా గజిబిజీగా ఉందనుకుంటున్నారా..? అయితే ఇంతకి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఆన్ లైన్ షాపింగ్ లో మనం కొనుగోలు చేసిన వస్తువులకు ఎక్కువ శాతం మోసాలు చేయడం, మోసపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. ఆన్ లైన్ షాపింగ్ లో జాక్ పాట్ ను కొట్టేశాడు. అదేంటి, ఆన్ లైన్ షాపింగ్, మోసాలు, ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టడం అంతా గజిబిజీగా ఉందనుకుంటున్నారా..? అయితే ఇంతకి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఉండే గీరాకీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తరుచు ఉరుకులు పరుగుల జీవితంలో బతుకున్న వారికి బయట షాప్ లకు వెళ్లి షాపింగ్ చేసే తీరిక కూడా లేకుండా పోయింది. ఏమాత్రం ఖాళీ దొరికిన ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే అందరూ చూస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎవరికీ ఏ వస్తువు కావాలన్నా.. అందరూ ఆన్ లైన్ షాపింగ్ వైపే ఆసక్తి కనుబరుచుతున్నారు. పైగా ఆన్ లైన్ షాపింగ్ లో కూడా కస్టమర్లను ఆకర్షించడానికి ఆయా సంస్థలు రకరకాల ఆఫర్లను, భారీగా డిస్కాంట్ లను ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న వస్తువులు దగ్గర నుంచి ఎలక్ట్రికల్, ఫర్నిచర్, చివరికి గోల్డ్ జ్యూలరీ వరకు ఈ మధ్య అందరూ ఆన్ లైన్ షాపింగ్ వైపే ఆసక్తి కనుబరుచుతున్నారు.అయితే సాధారణంగా ఈ ఆన్ లైన్ షాపింగ్ లో మనం కొనుగోలు చేసిన వస్తువులకు ఎక్కువ శాతం మోసాలు చేయడం, మోసపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ, తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలోని ఓ వ్యక్తి మాత్రం ఏకంగా.. ఆన్ లైన్ షాపింగ్ లో జాక్ పాట్ ను కొట్టేశాడు. అదేంటి, ఆన్ లైన్ షాపింగ్, మోసాలు, ఓ వ్యక్తి జాక్ పాట్ కొట్టడం అంతా గజిబిజీగా ఉందనుకుంటున్నారా.. అయితే ఇంతకి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవలే మెక్సికోకు చెందిన రిజిలియో విల్లా ర్రియల్ అనే వ్యక్తి గతేడాది కార్టియర్ అనే ఫ్రెంచ్ జ్యూలరీ సంస్థ వెబ్ సైట్ తెరిచి విండో షాపింగ్ చేస్తున్నాడు. అయితే అక్కడ వాటి ధరలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు.కానీ ఇంతలోనే అందులో 132 వజ్రాలతో పొదిగిన బంగారు చెవి కమ్మల ధర కేవలం 13.85 డాలర్లు మాత్రమే అని రాసి కనిపించింది. దీంతో ఆ ఆఫర్ ను చూసి సంతోషంతో ఉబ్బితబ్బియాడు. కాగా, వెంటనే ఆ రెండు జతల చెవి కమ్మలకు ఆన్ లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టాడు. ఇక తన ఆర్డర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూడటం మొదలు పెట్టాడు. కానీ, ఈ ఆర్డర్ ను చూసి ఆ కంపెనీ కంగుతిన్నది. అంతేకాకుండా.. వెబ్ సైట్ లో రేటు ఎంటర్ చేసేటప్పుడు టైపింగ్ లో చిన్న పొరపాటు జరిగిందని గుర్తించింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని కస్టమర్ కు తెలియజేసింది.  ఇక వాటి ఆ జత చెవి కమ్మల ధర రూ. 14,000 డాలర్లు అని కూడా తెలిపింది.

ఇక తాము పొరపాటు చేసినందున రెండు జతల కమ్మల ఆర్డర్ ను క్యాన్సిల్ చేసి అందుకు బదులుగా కన్సొలేషన్ బహుమతి అందిస్తామని ఆఫర్ ఇచ్చింది.  కానీ, రిజిలియో  ఈ ఆఫర్ ను తిరస్కరించాడు. తాను ఆర్డర్ పెట్టిన రెండు జతల కమ్మలను డెలివర్ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. ఇక దీనిపై మెక్సికో వినియోగదారుల పరిరక్షణ ఏజెన్సీని ఆశ్రయించాడు. దీంతో నెలలపాటు జరిగిన వాదనల అనంతరం కార్టియర్ సంస్థ వెనక్కి తగ్గింది.  ఈ క్రమంలోనే అతడు ఆర్డర్ ను తాజాగా డెలివరీ చేసింది. ఇదిలా ఉంటే.. రిజిలియో అందమైన చెవి కమ్మల ప్యాకింగ్ ఫోటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా.. తన తల్లికి ఒక జత చెవి కమ్మలను ఇచ్చానని, మరో జతను తన వద్దే ఉంచుకున్నానని చెప్పాడు.

అయితే రిజిలియో వ్యవహరించిన వైఖరిపై నెటిజన్ల నుంచి రకరకాలుగా స్పందన వస్తోంది. కొందరు యూజర్లు అతను చేసిన దాంట్లో తప్పేమీ లేదని వాదించారు. మరికొందరు మాత్రం అతన్ని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కంపెనీ చేసిన సాధారణ పొరపాటు ద్వారా అనుచితంగా లబ్ధి పొందడం బాగోలేదని అంటున్నారు. మరి, కంపెనీ చేసిన పొరపాటుకు ఆ వ్యక్తి పొందిన జాక్ పాట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments