ఆ దేశం వెళ్లే విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై డబ్బు సంపాదన కష్టమే!

ఆ దేశం వెళ్లే విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. ఇకపై డబ్బు సంపాదన కష్టమే!

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆ దేశం షాకిచ్చింది. ఇకపై ఆ దేశంలో విద్యార్థులకు డబ్బుసంపాదన కష్టంగా మారనుంది. ఇంతకీ ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆ దేశం షాకిచ్చింది. ఇకపై ఆ దేశంలో విద్యార్థులకు డబ్బుసంపాదన కష్టంగా మారనుంది. ఇంతకీ ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే?

ఉన్నత చదువుల కోసం చాలా మంది యువత విదేశాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఫారిన్ లో చదివిస్తే భవిష్యత్ కు ఏ లోటు ఉండదని అక్కడికి పంపించాలని భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంటారు. అయితే విదేశాల్లో చదువులు కొనసాగిస్తూ కొంతమంది విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటారు. తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడకుండా తమ ఖర్చులను తీర్చుకునేందుకు చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు. అయితే కెనడా దేశం విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. ఇకపై వారానికి 24 గంటలే పనిచేయాలని నిర్ణయించింది. దీంతో విదేశీ విద్యార్థులు నిరాశచెందుతున్నారు.

కెనడా దేశం విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ విద్యార్థులను ఉద్దేశించి ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశీ విద్యార్థులకు ఆఫ్‌-క్యాంపస్‌లో ఇక నుంచి వారానికి 24 గంటలు మాత్రమే పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక నిబంధన ప్రకారం.. వారానికి గరిష్ఠంగా 40 గంటలు పనిచేసుకునే అవకాశం ఉండేది. ట్రూడో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారత్‌ నుంచి కెనడా వెళ్లే విద్యార్థులపైనా ప్రభావం పడనుంది. కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఇకపై డబ్బు సంపాదన కష్టంగా మారనుంది.

అయితే ఆఫ్‌-క్యాంపస్‌ పనిగంటలపై పరిమితి విధించడం విద్యార్థులకు మేలు జరిగేందుకే అని కెనడా ఇమ్మిగ్రేషన్‌, రిఫ్యూజీ, సిటిజెన్‌షిప్‌ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్‌ మిల్లర్‌ పేర్కొన్నారు. కెనడాలోని విదేశీ విద్యార్థులు ఉద్యోగం కంటే చదువుపైనే ఎక్కువ దృష్టిసారించడానికి దోహదపడుతుందని ఆయన వెల్లడించారు. ఎక్కువ పనిగంటలు కల్పిస్తే విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైనట్టు ప్రభుత్వం తెలిపింది. వారానికి 24 గంటలు పనిచేసుకునే నిబంధన కొత్త విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాగా కెనడాలో సెప్టెంబర్‌ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.

Show comments