BRS Worker Injured: చికెన్‌ కర్రీలో పడ్డ BRS కార్యకర్త.. అసలేం జరిగిందంటే?

చికెన్‌ కర్రీలో పడ్డ BRS కార్యకర్త.. అసలేం జరిగిందంటే?

BRS Worker Injured: తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది.

BRS Worker Injured: తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వా నేనా అన్న చందంగా ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది.

ఇటీవల ప్రమాదాలు ఎప్పుడు ఎలా ముంచుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అప్పటి వరకు మనతో ఉన్నవాళ్లు హఠాత్తుగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ప్రాణాలతో బయటపడ్డవారు కొందరైతే.. కన్నుమూసిసేవారు మరికొందరు. రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, హార్ట్ ఎటాక్, అగ్ని ప్రమాదాలు ఇలా ఎన్నో రకాలుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నడుస్తుంది. తెలంగాణలో అధికార పార్టీ మరోసారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకున్నే ప్రయత్నం చేస్తుంది. ఇరు పార్టీ నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మీటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తుంది. వీధుల్లో ప్రచారాల మోత మోగుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ మళ్లీ తమ సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నం మీదే ఉండగా.. అధికార పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకునేందు ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ధారూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యక్తల సమీవేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేలా కృషి చేయాలని కార్యకర్తలతో హితబోద చేశారు. సమావేశం అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సమయంలో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారే భోజనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకరినొకరు తోసుకుంటూ చికెన్ కర్రీ వేసుకునేందుకు ముందుకు వెళ్లారు. అంతలోనే మండల పరిదిలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొర్రెంకల మల్లయ్య కార్యకర్త తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్ బోగాణలో పడిపోయారు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కార్యకర్తలు, నాయకులు అయన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటి వరకు పార్టీ నేతలతో, కార్యకర్తలో మాట్లాడుతూ సందడిగా ఉన్న మల్లయ్య హఠాత్తుగా ప్రమాదానికి గురి కావడంతో అందరూ షాక్ లో మునిగిపోయారు.

Show comments