NBK109- Dussehra Release: దసరా బరిలో బాలకృష్ణ?

దసరా బరిలో బాలకృష్ణ?

NBK 109 Release Update: నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

NBK 109 Release Update: నందమూరి బాలకృష్ణ 109వ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 109వ సినిమాను ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లితో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య ఇటీవల వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడం వల్ల ఆయన తాజా సినిమాపై అటు నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. NBK109 చిత్ర యూనిట్ ఎలాంటి హడావుడి లేకుండానే శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎంత వరకూ వచ్చింది? ఎక్కడ జరుగుతోంది? అనే వివరాలు ఏవీ బయటకు రాకుండా చిత్ర బృందం జాగ్రత్త పడటంతో ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఇప్పటి వరకు ఎవరూ ఒక అంచనాకి రాలేకపోయారు. జూలై మూడు లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేసినా… అవేవీ నిజం కాలేదు. ఓ వైపు జూలై 19 లేదా 26 తేదీల్లో బాలయ్య 109వ చిత్రం విడుదల అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా సీజన్లో అక్టోబర్ 4న విడుదలవుతుందని అంటున్నారు.  బాలకృష్ణతో పాటు ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, మరో ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారు.

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం కథ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ నుంచి ఆశించే మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక కొత్త కథాంశం ఉంటుందట. కాగా NBK109 పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని టాక్. గతేడాది దసరాకి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాని రిలీజ్ చేసి హిట్ అందుకున్నారు. మరి NBK109 కూడా దసరా పండుగ సందర్భంగా విడుదల అయితే బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

Show comments