Pakistan Fielding Shikhar Dhawan Tweet: పాక్​పై​ ధావన్ ఫన్నీ ట్వీట్.. ముగింపు లేని లవ్​ స్టోరీ అంటూ..!

పాక్​పై​ ధావన్ ఫన్నీ ట్వీట్.. ముగింపు లేని లవ్​ స్టోరీ అంటూ..!

  • Author singhj Updated - 10:13 AM, Wed - 4 October 23
  • Author singhj Updated - 10:13 AM, Wed - 4 October 23
పాక్​పై​ ధావన్ ఫన్నీ ట్వీట్.. ముగింపు లేని లవ్​ స్టోరీ అంటూ..!

పాకిస్థాన్.. క్రికెట్​లో అంచనాలకు అందని టీమ్ ఇది. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగల సత్తా ఈ జట్టుకు ఉంది. అయితే అదే సమయంలో పసికూన జట్ల చేతుల్లోనూ ఓటమి పాలవ్వడం, గెలవాల్సిన మ్యాచ్​లో పరాజయం పాలవ్వడం, ఫేవరెట్స్​గా బరిలోకి దిగి ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడం పాక్​కు అలవాటుగా మారింది. అలాగని ఆ టీమ్​ను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎలాంటి ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా అండర్​డాగ్స్​గా దిగి అద్భుతంగా రాణించిన సందర్భాలు కూడా పాక్ హిస్టరీలో ఉన్నాయి. ఈసారి వరల్డ్ కప్​లో పాక్ సెమీస్​కు వెళ్తుందన్న అంచనాలు పెద్దగా ఎవరికీ లేవు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి జట్లను దాటి సెమీస్​, ఫైనల్స్​కు చేరుకోవడం పాక్​కు కష్టమేనని క్రికెట్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. అందుకు తగ్గట్లే వరల్డ్ కప్​కు ముందు పాక్ జట్టులో బలహీనతలు బయటపడుతున్నాయి. ప్లేయర్ల మధ్య గొడవలు, కెప్టెన్​ బాబర్​ ఆజంతో ఎవరికీ పడట్లేదంటూ ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లు న్యూజిలాండ్​తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్​లో ఓడిన దాయాది జట్టు.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ప్రాక్టీస్ మ్యాచ్​లోనూ అంచనాలకు తగ్గట్లుగా ఆడట్లేదు. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 351 రన్స్ చేసింది.

పాక్ జట్టు బలం బౌలింగ్ అనేది తెలిసిందే. కానీ కంగారూలతో మ్యాచ్​లో ఆ టీమ్ బౌలింగ్ యూనిట్ ఘోరంగా ఫెయిలైంది. ఫీల్డర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. మామూలుగానే పాక్ జట్టు ఫీల్డింగ్ నాసిరకంగా ఉంటుంది. ఈ మ్యాచ్​లో ఆ డొల్లతనం మరోమారు బయటపడింది. సాధారణ బంతులను కూడా పాక్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో భారత క్రికెటర్ శిఖర్ ధవన్ ఆ టీమ్​పై జోకులు పేల్చాడు. ఫీల్డింగ్​కు పాకిస్థాన్​కు ఉన్న లవ్ స్టోరీకి ముగింపు లేదని ట్వీట్ చేశాడు ధవన్. దీనికి పాక్ ప్లేయర్లు మిస్ ఫీల్డింగ్ చేసిన ఒక వీడియోను జత చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ పాక్ క్రికెటర్లు మారరని.. అందుకే వాళ్లని పాకిస్థానీలు అంటార్రా బాబు అంటూ పరువు తీస్తున్నారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​కు ముందు చెత్తకుప్పలా ఉప్పల్ స్టేడియం!

Show comments