Muslim Girl Married Hindu Boy: అమ్మవారి గుడిలో హిందూ యువకుడితో ముస్లిం యువతి వివాహం!

అమ్మవారి గుడిలో హిందూ యువకుడితో ముస్లిం యువతి వివాహం!

Muslim Girl Married Hindu Boy In Temple: ముస్లిం యువతి అమ్మవారి ఆలయంలో హిందూ యువకుడిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంది. వివాహం మాత్రమే కాదు ఆ యువతి సనాతన ధర్మాన్ని కూడా స్వీకరించింది.

Muslim Girl Married Hindu Boy In Temple: ముస్లిం యువతి అమ్మవారి ఆలయంలో హిందూ యువకుడిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంది. వివాహం మాత్రమే కాదు ఆ యువతి సనాతన ధర్మాన్ని కూడా స్వీకరించింది.

ప్రస్తుతం ప్రేమ వివాహాలు ఎక్కువైన విషయం తెలిసిందే. పెద్దలు కూడా పిల్లల ఇష్టాన్ని అంగీకరించి వారికి నచ్చినవారితో వివాహం జరిపిస్తున్నారు. అయితే ఇప్పటికీ కొందరు తల్లిందండ్రులు మాత్రం పిల్లల ప్రేమను అంగీకరించడం లేదు. తాజాగా ఓ ప్రేమ జంట అమ్మవారి ఆలయంలో హిందూ సాంప్రదాయంలో ఏడు అడుగులు వేసి ఒకటయ్యారు. పెళ్లి కొడుకు హిందూ యువకుడు కాగా.. పెళ్లి కుమార్తె మాత్రం ముస్లిం అమ్మాయి. శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయంలో ఈ ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఆ యువతి వివాహం చేసుకోవడమే కాదు.. సనాతన ధర్మా స్వీకరించింది. ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే చాలానే ప్రేమ వివాహాలు జరిగాయి. కులాలు, మతాలు వంటి బేధాభిప్రాయాలు లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ లిస్ట్ లోకి మరో జంట చేరింది. ఈ ప్రేమ వివాహం ఉత్తర్ ప్రదేశ్ మహోబాలోని పన్ వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రేమ వివాహం జరిగింది. పన్వాడీ కాశ్మీర్ లో అదే పట్టణానికి చెందిన దినేశ్ జైస్వాల్ ని గౌరయ్య మాత ఆలయంలో అర్జు రైన్ అనే ముస్లిం యువతి హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకుంది. సనాతన ధర్మాన్ని స్వీకరించడమే కాకుండా.. వివాహం తర్వాత ఆ యువతి తన పేరును కూడా మార్చుకుంది.

అర్జురైన్ గా ఉన్న ఆమె.. తన పేరును ఆర్తి జైస్వాల్ గా మార్చుకుంది. అలాగే పెళ్లి తర్వాత జైశ్రీరామ్ అంటూ నినాదాలు కూడా చేసింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవడం మాత్రమే కాకుండా.. సనాతన ధర్మాన్ని స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆర్తి జైస్వాల్ వ్యాఖ్యానించింది. సనాతన ధర్మం అంటే తనకు ఎంతో ఇష్టమని.. అందరూ సనాతన ధర్మం నుంచే వచ్చామంటూ వ్యాఖ్యానించింది. తాను తన ఇష్టపూర్వకంగానే సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు స్పష్టం చేసింది. అర్జు రైన్ ఎప్పటి నుంచో హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్నట్లు వెల్లడించింది. నవరాత్రులకు అమ్మవారి పూజ, శ్రీరామ నవమికి రాములోరిని ఆరాధించడం, దీపావళికి టపాసులు కాల్చడం చేసేదాన్నని చెప్పింది.

ముస్లిం ధర్మ ప్రకారం నికా అంటే రాజీ అని.. హిందూ ధర్మంలో మాత్రం పెళ్లి సమయంలో వేసే ఏడు అడుగులు ఏడు జన్మల సంబంధంగా పరిగణించబడుతుంది అంటూ అర్జు రైన్ కామెంట్స్ చేసింది. అయితే అర్జు రైన్- దినేశ్ జైస్వాల్ 2018లోనే ఇంటి నుంచి పారిపోయారు. వాళ్లు ఇద్దరూ నోయిడాలో కలిసి జీవించారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత వీళ్లిద్దరు ఇంటికి తిరిగి వచ్చి అమ్మవారి ఆలయంలో వివాహం చేసుకున్నారు. అయితే ఆర్తీ జైస్వాల్ కుటుంబం మాత్రం ఆమెను అంగీకరిచడం లేదు. తమకు కుమార్తె లేదు అని వాళ్లు నిర్ణయానికి వచ్చేశారు. వారి వివాహాన్ని కూడా వాళ్లు ఆమోదించలేదు. అర్జు రైన్ మొత్తానికి వాళ్లు సంబంధాలు తెంచేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Show comments