AP Sarpanch UN Conference: AP సర్పంచ్ అరుదైన గౌరవం.. ఐక్యరాజ్యసమితి సదస్సుకు ఆహ్వానం!

AP సర్పంచ్ అరుదైన గౌరవం.. ఐక్యరాజ్యసమితి సదస్సుకు ఆహ్వానం!

AP Sarpanch UN Conference: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ప్రజాపాలన విషయంలో మహిళలకు పెద్ద పీట వేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన సర్పంచ్ కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

AP Sarpanch UN Conference: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ ప్రజాపాలన విషయంలో మహిళలకు పెద్ద పీట వేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన సర్పంచ్ కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.

ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు.. రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చేలా కృషి చేస్తూ వస్తున్నారు. ఐదేళ్ల పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేధికలపై మన రాష్ట్రానికి అరుదైన గౌరవాలు దక్కాయి. ఆరు నెలల క్రితం న్యూయర్క్ నగరంలో యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోర్ కార్యక్రమాంలో పాల్గొనేందుకు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న పది మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ చెందిన సర్పంచ్ కి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీని నిర్వహిస్తున్న 57వ మకిషన్ ఆన్ పాపులేషన్ అండే డెవలప్ మెంట్ సదర్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి ముగ్గురు ప్రజా ప్రతినిధులుకు అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కి చెందిన సర్పంచ్ కి ఆహ్వానం అందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకెరు సర్పంచ్ అయిన కునుకు హేమ కుమారికి ఆహ్వానం అందింది. ఏపీ నుంచి సర్పంచ్ హేమ కుమారి, త్రిపుర నుంచి సెపాహిజాల జడ్పీ చైర్ పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్ నుంచి ఝంజున్ జిల్లా లంబిఅహిర్ సర్పంచ్ నీరూ యాదవ్ లకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ ముగ్గురు భారత దేశంలోని స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు, సాధించిన లక్ష్యల గురించి ప్రసంగించాల్సి ఉంటుంది.

ఇక సర్పంచ్ హేమ కుమారి విషయానికి వస్తే.. 2021 ఏప్రిల్ లో పేకేరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2022 లో కాకినాడ జేఎన్‌టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. అలాగే ఐదేళ్ల పాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్ గా పనిచేశారు. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్ కుమార్ లతో కలిసి భారత్ ప్యానల్ తరుపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ది గురించి ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేయడం విశేషం.

Show comments