AP Elections 2024-Asaduddin, Opposition Alliance: AP ప్రజలు TDP, జనసేన, BJP కూటమిని నమ్మొద్దు.. వారికి ఓటేయవద్దు: అసదుద్దీన్‌ ఓవైసీ

AP ప్రజలు TDP, జనసేన, BJP కూటమిని నమ్మొద్దు.. వారికి ఓటేయవద్దు: అసదుద్దీన్‌ ఓవైసీ

ఏపీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి ఓటేయవద్దన్నారు. ఆ వివరాలు..

ఏపీ ఎన్నికల వేళ.. తెలంగాణ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి ఓటేయవద్దన్నారు. ఆ వివరాలు..

దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు రిజర్వేషన్ల గొడవ రాజుకుంది. దాంతో అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు రిజర్వేషన్ల చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ముస్లిం రిజర్వేషన్లు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే దీనిపై ఇప్పుడెందుకు ఇంత రచ్చ అంటే.. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో ఇటీవల పర్యటించిన కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా.. తాము అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం.

అయితే ఈ అంశం అటు తెలంగాణ రాజకీయాల్లోనే కాక.. ఏపీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ స్టాండ్‌కు కూటమి కట్టుబడి ఉండాలి. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు కూటమిని నమ్మవద్దని.. దానికి ఓటేయవద్దని కోరారు. ఆ వివరాలు..

ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్‌ అంశంపై స్పందిస్తూ.. అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు జగన్‌కు ఓటేయాలని.. కూటమిని నమ్మవద్దని.. కోరారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ..‘‘మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఆ పార్టీలకు లేదు. ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు అంటే బీజేపీ, తెలుగు దేశం, జనసేన పార్టీలకు శత్రువులతో సమానం. వీరంతా బీజేపీ ఏజెండా కిందనే పని చేస్తారు. ఏపీలో బీజేపీ, నాయుడు, జనసేనకు ఓటేస్తే ముస్లిం, ఎస్సీ మైనార్టీలను రద్దు చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ఈ సందర్భంగా నేను ఏపీ ఓటర్లు జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి. ఆయన కమ్యూనల్‌ కాదు. మైనార్టీల అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నారు. వారి సంక్షేమం విషయంలో జగన్‌ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వరు. అదే కూటమికి ఓటేస్తే.. చంద్రబాబు నాయుడు మనల్నే కాంప్రమైజ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అలా జరకూడదంటే.. ఏపీ జనాలు జగన్‌ వెంటే ఉండాలి’’ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తాం’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పినట్టుగా ఉన్న ఫేక్ వీడియో వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ‘‘అధికారంలోకి రాగానే.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం. అవి రాజ్యాంగ విరుద్ధం’’ అని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను.. కొందరు కావాలనే ఎడిట్ చేసి.. అందులో ‘‘ముస్లిం’’ అనే చోట ‘‘ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ’’ అనే పదాలు వచ్చేలా చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తోన్న ఢిల్లీ పోలీసులు పలువురుకి సమన్లు కూడా జారీ చేశారు.

Show comments