వ్యభిచారంపై రష్మీ పోస్ట్.. మగవాళ్లు అలాంటోళ్ళు అయితే అదే ఉండదంటూ..

వ్యభిచారంపై రష్మీ పోస్ట్.. మగవాళ్లు అలాంటోళ్ళు అయితే అదే ఉండదంటూ..

యాంకర్ రష్మీ సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలవడం తెలిసిన విషయమే. తాజాగా రష్మీ చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. మగాళ్లు అలాంటోళ్లు అయితే అంటూ వ్యభిచారంపై పోస్టు పంచుకుంది.

యాంకర్ రష్మీ సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలవడం తెలిసిన విషయమే. తాజాగా రష్మీ చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. మగాళ్లు అలాంటోళ్లు అయితే అంటూ వ్యభిచారంపై పోస్టు పంచుకుంది.

బుల్లితెర యాంకర్లలో రష్మీకి ఉండే క్రేజ్ వేరు. తన అందం అభినయం, ఆకట్టుకునే మాటలతో ఆడియెన్స్ ను కట్టిపడేస్తుంది. ప్రముఖ రియాలిటీ షో జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా రష్మీ మరింత పాపులర్ యాంకర్ గా పేరుతెచ్చుకుంది. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో కుక్కలకు ఆహారం నీరు అందించి మానవత్వం చాటుకుంది. డాగ్స్ కు ఏదైనా ఆపద వస్తే తన ఆపదలాగా భావిస్తుంది. మూగజీవాలపై హింసకు పాల్పడే వారిపట్ల విరుచుకుపడుతుంది. అంతే కాదు సామాజిక సమస్యలు, మహిళల సమస్యలపై స్పందిస్తూ అందుకు కారణమైన వారిని నిర్మోహమాటంగా ఏకిపారేస్తుంది. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రష్మీ గౌతమ్ ఏ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇదే రీతిలో తాజాగా ఆమె ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది. వ్యభిచారం, మహిళలపై చేసిన ఆ పోస్టు సంచలనంగా మారింది. ప్రముఖ రైటర్‌ రచెల్‌ మోరన్‌ రాసిన కోట్‌ని రష్మీ ఇన్ స్టా స్టోరీలో షేర్‌ చేసింది. `మహిళలు పేదరికంలో ఉండి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మనిషిగా మనం చేయాల్సింది వారికి ఫుడ్‌ పెట్టాలి, కానీ `డిక్‌` కాదు అని రచెల్‌ మోరన్‌ రాసిన కోట్‌ని మరో రైటర్‌ పంచుకోగా, ఆ స్క్రీన్‌ షాట్‌ని షేర్‌ చేసింది రష్మి.

మగవాళ్లు మంచివాళ్లైతే అసలు వ్యభిచారం అనేదే ఉండదు అని ఆ పోస్టులో ఉంది. ఇటు ఇండస్ట్రీలోనూ అటు దేశంలోనూ మహిళలపై జరుగుతున్న దారుణాలపై రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటుంది. ఈక్రమంలోనే వ్యభిచారంపై రష్మీ చేసిన పోస్టు వైరల్ గా మారింది. కాగా రష్మీ గౌతమ్ జబర్ధస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా చేస్తూ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. మరి రష్మీ చేసిన పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments