Actress Aishwarya- Shaym Kumar Issue: నటి ఐశ్వర్య- శ్యామ్ ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరిది?

నటి ఐశ్వర్య- శ్యామ్ ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరిది?

Anchor Aishwarya- Shyam Kumar: ప్రముఖ బుల్లితెర నటి ఐశ్వర్య- భర్త శ్యామ్ కుమార్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా శ్యామ్ కుమార్ పై నటి ఐశ్వర్య తీవ్ర ఆరోపణలు చేసింది.

Anchor Aishwarya- Shyam Kumar: ప్రముఖ బుల్లితెర నటి ఐశ్వర్య- భర్త శ్యామ్ కుమార్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా శ్యామ్ కుమార్ పై నటి ఐశ్వర్య తీవ్ర ఆరోపణలు చేసింది.

యాంకర్ ఐశ్వర్య అడ్డాల– పిన్నింటి శ్యామ్ కుమార్ వివాదం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. వీళ్లద్దరి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చకెక్కింది. దంపతులు ఇద్దరూ మీడియాలో చర్చలు మొదలు పెట్టిన తర్వాత అంతా వీరి గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వీరికి పెళ్లై ఇంకా ఏడాది కూడా కాలేదు. కానీ, ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడం చేస్తున్నారు. ఐశ్వర్య మంచిది కాదు అంటూ శ్యామ్.. భర్త వేధిస్తున్నాడంటూ ఐశ్వర్య డిబేట్లలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు  వీళ్ల గొడవలో తప్పు ఎవరిది?

ఐశ్వర్య అడ్డాల ప్రముఖ సీరియల్ నటి. ఈమెకు అమ్మాయి గారు, పలుకే బంగారమాయనే, అలా వైకుంఠపురంలో, అత్తారింటికి దారేది వంటి సీరియల్స్ తో మంచి ఫేమ్, నేమ్ వచ్చింది. ఈమెకు 2023 సెప్టెంబర్ 6న పిన్నింటి శ్యామ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఇన్నాళ్లు వీళ్ల గురించి, వీళ్ల సంసారం గురించి ఎవరీకీ పెద్దగా తెలియదు. కానీ, ఒక్కసారిగా వీళ్ల కాపురం ఇప్పుడు నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. అందుకు కారణం శ్యామ్ కుమార్ చేసిన ఆరోపణలే. తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉంది అంటూ ఆరోపించాడు. తన దగ్గర రూ.25 లక్షలు కాజేసి తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు.

రియల్టర్ కరణం రమేశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ ఆరోపించాడు. తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ కొన్ని ఆడియో కాల్స్ ని కూడా శ్యామ్ కుమార్ బయటపెట్టారు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాని.. పెళ్లైన కొన్ని రోజులకే ఐశ్వర్యకు ఉన్న చెడు అలవాట్లు, ఆమెకు ఉన్న అక్రమ సంబంధం బయటపడింది అంటూ కామెంట్స్ చేశాడు. తనకు న్యాయం చేయాలి అంటూ శ్యామ్ కుమార్ డిమాండ్ కూడా చేస్తున్నాడు. ఐశ్వర్య, ఆమె కుటుంబం వర్షన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఐశ్వర్య కూడా శ్యామ్ కుమార్ పై పలు ఆరోపణలు చేసింది.

ఎలాంటి ఆధారం లేకుండా తనకు అక్రమ సంబంధం అంటకడుతున్నాడు అంటూ వాపోయింది. తనని కావాలనే ఇలా టార్గెట్ చేస్తున్నాడు అంటు చెప్పుకొచ్చింది. అసలు ఈ గొడవలకు కారణం.. శ్యామ్ కుమార్ కు బిజినెస్ పెట్టిస్తామని అత్తమామలు చెప్పారని.. అలా చేయకపోవడంతోనే అసలు సమస్యలు మొదలయ్యాయి అంటూ చెబుతున్నారు. అంతేకాకుండా.. పెళ్లైన 16 రోజులకే శ్యామ్ కుమార్ తనని వేధించడం స్టార్ట్ చేశాడు అంటూ ఐశ్వర్య ఆరోపిస్తోంది. అతను చెప్పేవి అన్నీ అబద్ధాలే అంటోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై నిందలు వేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కుటుంబానికి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని.. అందరూ ఆత్మహత్యలు చేసుకోవాలా అంటూ ప్రశ్నించింది.

తన తండ్రి దొంగలా బయటకు వెళ్తున్నాడని.. ఎవరికీ కంటబడకుండా తిరుగుతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఎవరికి కనిపిస్తే ఎవరు తన గురించి అడుగుతారేమో.. వారికి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక ఆయన అలా చేస్తున్నారంటూ నటి ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఇద్దరి వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఐశ్వర్యకు చెడు అలవాట్లు, అక్రమ సంబంధం ఉందంటూ శ్యామ్ అంటున్నాడు. పెళ్లైన 16 రోజుల నుంచే తనని వేధిస్తున్నాడు అంటూ ఐశ్వర్య చెబుతోంది. ఇద్దరూ తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. న్యాయపరంగా ముందుకు వెళ్తామంటున్నారు. కాబట్టి వాళ్లు లీగల్ గా ప్రొసీడ్ అయ్యి.. దర్యాప్తు జరిగితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. అప్పటివరకు ఎవరి వాదనను నమ్మేందుకు, తప్పు ఎవరిదో నిర్ధారించేందుకు ఆస్కారం మాత్రం లేదు.

Show comments