అగ్నిపథ్ కి సపోర్ట్ గా ఆనంద్ మహీంద్రా.. అగ్నివీర్ లకు భవిష్యత్తులో ఉద్యోగాలిస్తాం..

అగ్నిపథ్ కి సపోర్ట్ గా ఆనంద్ మహీంద్రా.. అగ్నివీర్ లకు భవిష్యత్తులో ఉద్యోగాలిస్తాం..

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన శైలిలో కామెంట్లు చేస్తారు. తాజాగా గత కొద్దీ రోజులుగా భారత్ లో ట్రెండింగ్ లో ఉన్న అగ్నిపథ్ అంశంపై ఆయన ట్వీట్స్ చేశారు.

నాలుగేళ్ల పాటు సాయుధ దళాల రెగ్యులర్ కేడర్ లో పనిచేయడానికి పలు అభివృద్ధి చెందిన దేశాలలాగే యువతకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించింది. అయితే దీనిని ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లకపోవడం, దీనిలో ఉన్న సందేహాల్ని నివృత్తి చేయకపోవడం, విపక్షాలు ఈ పథకం గురించి తప్పుగా ప్రమోట్ చేయడంతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మరోపక్క అగ్నిపథ్ కి సపోర్ట్ గా త్రివిధ దళాలు, పలువురు ప్రముఖులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా కూడా అగ్నిపథ్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేశారు. ఆనంద్ మహీంద్రా తన ట్వీట్స్ లో.. అగ్నిపథ్ కార్యక్రమం చుట్టూ జరిగిన హింసతో బాధపడ్డాను. గత సంవత్సరం ఈ పథకం ప్రతిపాదించినప్పుడు అగ్నివీర్లు పొందే క్రమశిక్షణ మరియు నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయి అని నేను చెప్పాను. అటువంటి శిక్షణ పొందిన, సమర్థవంతమైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూపు స్వాగతిస్తుంది.

కార్పొరేట్ సెక్టార్ లో అగ్నివీర్ లకు పెద్ద ఎత్తున ఉపాధి ఉండబోతుంది. నాయకత్వం, టీమ్ వర్క్ మరియు ఫిజికల్ ట్రైనింగ్ తో అగ్నివీర్ లు ఇండస్ట్రీకి మార్కెట్ రెడీ ప్రొఫెషనల్ సొల్యూషన్ లను అందిస్తారు. ఆపరేషన్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మరియు సప్లై ఛైయిన్ మేనేజ్మెంట్ వరకు అన్ని విభాగాల్లోనూ అగ్నివీర్ లకు మహీంద్రాలో కూడా ఉద్యోగాలు ఇస్తాము అని తెలిపారు.

Show comments