Mahindra XUV 3XO Price And Specifications: మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ప్రీమియం లుక్స్ తో మహీంద్ర XUV 3XO.. ధర ఎంతంటే?

మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ప్రీమియం లుక్స్ తో మహీంద్ర XUV 3XO.. ధర ఎంతంటే?

Price Of Mahindra Xuv 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా మరో బడ్జెట్ రేంజ్ లో ఉండే ప్రీమియం కారును విడుదల చేసింది. ఈ కారుకు దాని ధరకు అస్సలు సంబంధం లేదు. మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే ఈ కారు ఉండటం విశేషం.

Price Of Mahindra Xuv 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా మరో బడ్జెట్ రేంజ్ లో ఉండే ప్రీమియం కారును విడుదల చేసింది. ఈ కారుకు దాని ధరకు అస్సలు సంబంధం లేదు. మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే ఈ కారు ఉండటం విశేషం.

కారు అనేది అందరికీ అవసరంగా మారిపోయింది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్లు కూడా కారు కొనుక్కోవాల్సిన అవసరం వచ్చేసింది. అందుకే ఇప్పుడు కారును విలాసం లిస్ట్ లో నుంచి తీసేసి అవసరంగా మార్చేశారు. ఎంత కేటగిరీ మారిపోయినా.. మధ్యతరగతి వాళ్లు మాత్రం బడ్జెట్ లో బెస్ట్ కారు తీసుకోవాలి అనుకుంటారు. ఇప్పటికే మార్కెట్ లో చాలానే కార్లు, మోడల్స్ వచ్చాయి. కానీ, మన ప్రైస్ రేంజ్ లో ప్రీమియం లుక్స్ తో మాత్రం రాలేదు. అలా కోరుకునే వారికి ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్ర రిలీజ్ చేసిన మహీంద్ర XUV 3XO బెస్ట్ ఆప్షన్ అనే చెప్పారి. ధరని కూడా తాజాగా విడుదల చేశారు. మరి.. ధర ఎంత? ఏం ఫీచర్స్ ఉన్నాయి? అనే విషయాలు చూద్దాం.

ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్ లో మహీంద్రా XUV 3XO గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం లుక్స్ తో ఈ కారును విడుదల చేశారు. పైగా ఆ ధర ఎంతో చెప్పిన తర్వాత చాలామందికి కళ్లు బైర్లు కమ్మాయి. ఎందుకంటే ఆ కారు మోడల్, లుక్స్, ఇంటీరియల్, ఎక్స్ టీరియర్ కి వాళ్లు చెప్పిన ధరకు పొంతన కుదరడం లేదు. కారు చూస్తే మంచి ప్రీమియంగా ఉంది. ఈ మహీంద్రా XUV 3XO ప్రారంభ ధర రూ.7.49 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఫిక్స్ చేశారు. అలాగే ఉందులో చాలానే వేరియంట్స్ ఉన్నాయి. ఒక్కో వేరియంట్ మారితే ధర, ఫీచర్స్ కూడా మారుతూ ఉంటాయి.

మహీంద్ర ఎక్స్యూవీ 300కి అప్ డేటెడ్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ గా వస్తున్నదే ఈ మహీంద్రా XUV 3XO. అప్ డేటెడ్ డిజైన్, అప్ డేటెడ్ ఫీచర్స్, అప్ డేటెడ్ కలర్ ఆప్షన్స్ ఇలా ప్రతి విషయంలో అప్ డేట్ అనేది కనిపిస్తోంది. ఈ మహీంద్రా XUV 3XOలో మొత్తం 9 వేరియంట్స్ ఉన్నాయి. ఎంఎక్స్ 1, ఎంఎక్స్ 2, ఎంఎక్స్ 2 ప్రో, ఎంఎక్స్ 3, ఎంఎక్స్ 3 ప్రో, ఏఎక్స్ 5, ఏఎక్స్ 5ఎల్, ఏఎక్స్ 7, ఏఎక్స్ 7ఎల్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ కారు 3 ఇంజిన్ ఆప్షన్స్ తో వస్తోంది. 1.5 లీటర్ టర్బో డీజిల్ విత్ సీఆర్డీఈ(కేవలం మాన్యువల్ ట్రాన్సిసషన్), 1.2 లీటర్ టీసీఎంపీఎఫ్ఐ ఇంజిన్, 1.2 లీటర్ ఎంస్టాలియన్ టీజీడీఐ ఇంజిన్ వేరియంట్స్ ఉన్నాయి. 1.2 లీటర్ ఇంజిన్స్ లో మ్యాన్యువల్, ఆటోమేటిక్ రెండు ట్రాన్సిషన్స్ ఉన్నాయి.

ఎంఎక్స్ 1 అనేది బేసిక్ వర్షన్. దీని ధర రూ.7.49 లక్షలు ఎక్స్ షోరూమ్ గా నిర్ణయించారు. కానీ, ఫీచర్స్, సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. బేస్ మోడల్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే టాప్ ఎండ్ ఏఎక్స్ 7ఎల్ మాన్యువల్ ధర రూ.13.99 లక్షలు(ఎక్స్ షోరూమ్), ఆటోమేటిక్ ట్రాన్సిషన్ ధర రూ.15.49 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. ఈ మహీంద్రా XUV 3XO చాలా కలర్ ఆప్షన్స్, డ్యూయల్ టోన్ ఆప్షన్స్ తో వస్తోంది. ఇంటీరియర్ లెథ్రెట్ సీట్స్, మంచి స్పేస్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ సెగ్మెంట్ లోనే లీడింగ్ ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా లెవల్ 2 ఏడాస్ ఫీచర్స్ తో వస్తోంది. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ విత్ హిల్ హోల్డ్ అసిస్టెన్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, 4 డిస్క్ బ్రేక్స్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు బుకింగ్స్ మే 15 నుంచి ఓపెన్ కానున్నాయి.

Show comments