Ambajipeta Marriage Band Review & Rating in Telugu: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ రివ్యూ!

Ambajipeta Marriage Band Review: అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ రివ్యూ!

Ambajipeta Marriage Band Movie Review & Rating In Telugu: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాపై సుహాస్ పూర్తిగా అంచనాలు పెంచేశాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో అదరగొట్టేశాడు. మరి.. సినిమా ఆ రేంజ్ లోనే ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం

Ambajipeta Marriage Band Movie Review & Rating In Telugu: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాపై సుహాస్ పూర్తిగా అంచనాలు పెంచేశాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో అదరగొట్టేశాడు. మరి.. సినిమా ఆ రేంజ్ లోనే ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్

20240202, U/A
కామెడీ , డ్రామా
  • నటినటులు:సుహాస్, శివాని నగరం, నితిన్ ప్రసన్న. శరణ్య ప్రదీప్
  • దర్శకత్వం:దుష్యంత్ కటికనేని
  • నిర్మాత:ధీరజ్ మొగిలినేని, వెంకట్ రెడ్డి, బన్నీ వాస్ (సమర్పకుడు), వెంకటేష్ మహా (సమర్పకుడు)
  • సంగీతం:శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ:వాజిద్ బేగ్

3.25

టాలీవుడ్ లో చాలా కొద్ది మంది యాక్టర్స్ మాత్రమే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నారు. వారిలో హీరో సుహాస్ కూడా ఒకడు. ఈ యంగ్ హీరో ఓకే చేశాడు అంటే ఆ కథ పక్కా బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోతారు. అలాంటి ఈ హీరో ఇప్పుడు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అనే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతేకాకుండా రిలీజ్ కి ముందు నుంచే ఈ మూవీ కథ వినగానే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయి పోయాను అంటూ కామెంట్స్ కూడా చేశాడు. ట్రైలర్ చూశాక ఆడియన్స్ కి కూడా ఆసక్తి ఎక్కువైంది. మరి.. అంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి.

కథ:

అంబాజీపేట అనే ఓ చిన్న గ్రామం. అక్కడ మల్లి ( సుహాస్), పద్మ (శరణ్య ప్రదీప్) అక్కాతమ్ముళ్లు. ఇదే గ్రామంలో కోటీశ్వరుడు వెంకట్.. ఊరిలో అందరికీ అప్పులు ఇచ్చి, అందరిని తన కంట్రోల్ లో పెట్టుకుంటూ ఉంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పని చేసే మల్లి, వెంకట్ చెల్లులు లక్ష్మీ ( శివానీ నాగారం) ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ఒకవైపు సాగుతుండగానే.. వెంకట్, పద్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే.. ఒకరోజు వెంకట్.. తన చెల్లులు మల్లితో ప్రేమలో ఉందని తెలుసుకుని పగతో రగిలిపోతాడు. ఇదే అదునుగా భావించి పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడ నుండి ఆ ఊరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ.

విశ్లేషణ:

ఈ కథ 2007 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి పరిస్థితులను సరిగ్గా.. ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు నేరేషన్ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. ఇక క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం, స్టోరీ ప్రోగ్రెస్ కోసం కాస్త సమయం తీసుకున్నా.. లవ్ ట్రాక్ అద్భుతంగా పండటం పెద్ద ప్లస్ అయ్యింది. అయితే.. ప్రీ ఇంటర్వెల్ నుండి.. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు దర్శకుడు కథని నడిపించిన తీరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్థాయిని అమాంతం పెంచేసింది. మొత్తం ఫస్ట్ ఆఫ్ అంతా ఒక ఎత్తు.. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఒక ఎత్తు అన్న మూడ్ లోకి ఆడియన్స్ వెళ్లిపోవడం గ్యారంటీ.

కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి.. ఫస్ట్ ఆఫ్ ముగించడంతో సెకండ్ ఆఫ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే.. కథలోని బలం అంతా.. సెకండ్ ఆఫ్ లోనే ఉండటంతో దర్శకుడు చెలరేగిపోయాడు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లో శరణ్య ప్రదీప్ సన్నివేశాలు అన్నీ ఆడిటోరియం మొత్తాన్ని ఒక ఊపు ఉపేశాయి. కొన్ని సీక్వెన్స్ ల వరకు ఆమె ఒక్కటే కథని, కథనాన్ని, స్క్రీన్ టైమ్ ని ఆక్రమించేసింది. ఇదే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది. ఇక క్లయిమ్యాక్స్ లో కావల్సినంత ఎమోషన్ క్యారీ అయినా.., పెద్ద యాక్షన్ బ్లాక్ పెట్టుకునే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ ఛాయిస్ తీసుకోకుండా.., ఓ కొత్త టచ్ తో సినిమాని ముగించడం అద్భుతంగా అనిపించింది. ఓవరాల్ గా ఓ మంచి సినిమాని అందించడంలో టీమ్ సూపర్ సక్సెస్ అయ్యింది.

నటీనటుల పనితీరు:

టాలీవుడ్ లో ఉన్న గొప్ప నటుల్లో సుహాస్ ఒకడు. అతను చేసిన తక్కువ చిత్రాలకే ఈ ట్యాగ్ ఇవ్వడం కాస్త విచిత్రం అనిపించినా.. నటుడుగా సుహాస్ స్థాయిని తక్కువ పరిధిలో చెప్పలేము. కలర్ ఫోటో చిత్రంతో ఇది నిరూపితం అయినా.. అంబాజీపేటతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో ఈజీ గోయింగ్ క్యారెక్టర్ లో అదరగొట్టిన సుహాస్.. ఇక ఎమోషనల్ సీన్స్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇక సుహాస్ తరువాత తప్పక చెప్పుకోవాల్సింది.. శరణ్య ప్రదీప్ గురించి. ఫిదా తరువాత ఈమెకి కొన్ని అవకాశాలు దక్కినా.. ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం ఇదే మొదటిసారి. శరణ్య ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని నటనలో చెలరేగిపోయింది. ఇక పుష్ప ఫేమ్ జగదీశ్.. సంజయ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. కొత్త హీరోయిన్ శివాని నాగారం ఆకట్టుకుంది.మిగతా నటులు అంతా తమ పాత్ర పరిధి మేర బాగానే నటించారు.

టెక్నికల్ విభాగం:

ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద బలం. ముఖ్యంగా సీన్ మూడ్ చెడిపోకుండా ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఇక కెమెరా, ఆర్ట్ వర్క్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువల్లో ఎలాంటి రిమార్క్ లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దర్శకుడు దుష్యంత్ కటికనేని. ఇతని రైటింగ్ లో ఎంత బలం ఉందో.. డైరెక్టర్ గా కూడా అంతే గుడ్ వర్క్ చూపించాడు. ఇదే టెంపో మెయింటైన్ చేస్తే.. ఇతను ప్రామిసింగ్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరడం ఖాయం.

ప్లస్ లు:

  • సుహాస్ నటన
  • శరణ్య ప్రదీప్ నటన
  • కథ
  • డైరెక్షన్
  • మ్యూజిక్

మైనస్ లు:

  • కథ బాగున్నా రోటీన్ ట్రీట్మెంట్
  • సడెన్ గా క్లైమాక్స్ కి వెళ్లిపోవడం

రేటింగ్: 3.25/5

చివరి మాట: అంబాజీపేట.. సుహాస్ కెరీర్ బెస్ట్ మూవీ.

Show comments