Those Employees Good News: గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజులు సెలవు!

గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజులు సెలవు!

Those Employees Good News: ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ మహిళాభివృద్ది కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఆ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.

Those Employees Good News: ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్ మహిళాభివృద్ది కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. ఆ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పారు.

ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వ్యవసాయ, మహిళా సంక్షేమం కొరకు ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువచ్చారు సీఎం జగన్. తాజాగా జగన్ సర్కార్ ఆ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

రాష్ట్ర సాంక్షిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున శుభవార్త చెప్పారు. గురుకులాల్లోని మహిళా ఉద్యోగులకు ఏడాదికి అదనంగా 5 రోజులు సెలవు ( క్యాజువల్ లీవ్స్) ఇవ్వాలని నిర్ణయంచినట్లు మంత్రి మెరుగు నాగార్జున వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు రెగ్యూలర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళలందరికీ ఇది వర్తిస్తుందని అన్నారు. అంతే కాదు ఎస్సీ గురుకులాల్లో బదిలీలకు శాశ్వత మార్గదర్శాకాలు రూపొందిస్తున్నామని.. టీజీటీ టీచర్లకు పీజీ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనలను సడలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యాభివృద్ది కోసం సీఎం జగన్ ఎన్నో అద్భుతమైన పథకాలకు శ్రీకారం చుట్టారని.. త్వరలో దేశంలోనే విద్యారంగంలో ఏపీ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా మెరుగు నాగార్జన మాట్లాడుతూ.. ఏపీలో ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకొని సమాజంలో గొప్ప పొజీషన్ కి రావాలని సీఏం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. పేద పిల్లకు కార్పోరేట్ విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. విద్యాభివృద్ది కసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని.. విద్యా దీవెన పథకం కింద ఎంతోమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా ఎనిమిది లక్షలకు పైగా విద్యార్ధులు లబ్ది చేకూరుతుదని అన్నారు. మంత్రి చెప్పిన గుడ్ న్యూస్ కి గురుకులంలో పనిచేసే మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments