కీలక మ్యాచ్‌లో CSK ఓటమి! అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే.. ప్లే ఆఫ్స్‌కు RCB!

కీలక మ్యాచ్‌లో CSK ఓటమి! అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే.. ప్లే ఆఫ్స్‌కు RCB!

RCB, Playoffs, IPL 2024: ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇలా వరుస మ్యాచ్‌లు గెలుస్తుందని బహుషా ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. ఇదంతా ఒక పక్కా స్కెచ్‌ ప్రకారం జరుగుతుందని అనే టాక్‌ వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

RCB, Playoffs, IPL 2024: ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇలా వరుస మ్యాచ్‌లు గెలుస్తుందని బహుషా ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. ఇదంతా ఒక పక్కా స్కెచ్‌ ప్రకారం జరుగుతుందని అనే టాక్‌ వినిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమితో ప్లే ఆఫ్స్‌ ఈక్వేషన్స్‌ మారిపోయాయి. శుక్రవాం పంజాబ్‌పై విజయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌లో ఆర్సీబీ ఏకంగా 60 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన తర్వాత.. ఒక్కటంటే ఒక్కటే గెలుపు, 7 ఓటములతో ఆర్సీబీ అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే కాదు.. కనీసం ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే.. 9వ మ్యాచ్‌ నుంచి ప్రతి మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి. టీమ్‌లో కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ తప్పించి ఏ బ్యాటర్‌ కూడా ఫామ్‌లో లేడు. టీమ్‌లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం మాత్రం మారడం లేదు. ఇక బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌, టోప్లీ, లుకీ ఫెర్గుసన్‌, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌, డాగర్‌ ఇలా బౌలర్లంతా విఫలం అవుతున్నారు. 8 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత ఆర్సీబీపై ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు. కచ్చితంగా ఇంటి బాట పడుతుందని అంతా భావించారు. కానీ, 9వ మ్యాచ్‌ నుంచి ఆర్సీబీ ఆట మొత్తం మారిపోయింది. తొలి నుంచి ఆడుతున్న కోహ్లీ మరింత దూకుడు పెంచి ఆడుతున్నాడు. డుప్లెసిస్‌, విల్‌ జాక్స్‌, రజత్‌ పాటిదార్‌, గ్రీన్‌, డీకే, సిరాజ్‌, కరణ్‌ శర్మ, స్వప్నిల్‌ సింగ్‌ ఇలా అందరు అదరగొడుతుండటంతో.. ఆ‍ర్సీబీ వరుస విజయాలు సాధిస్తోంది. అయితే.. 9వ మ్యాచ్‌ నుంచి ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏం ఏం జరగాలో అవే జరుగుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఏదో దేవుడు స్క్రిప్ట్‌ రాసినట్లు.. అంతా ఆర్సీబీకి అనుకూలంగా జరుతున్నాయి అని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. 8 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత.. ఆర్సీబీ ఫ్లే ఆఫ్స​్‌కు చేరాలంటే ఏదో అద్భుతమే జరగాలి అని చాలా మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి. దేవుడు వారి వెంట ఉన్నట్లు అలాంటి అద్భుతాలే జరుగుతున్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడం, ఏ టీమ్స్‌ అయితే ఆర్సీబీకి పోటీగా ఉన్నాయో ఆ టీమ్స్‌ ఓడిపోవడం.. టాప్‌ 2 ప్లేస్‌లో ఉన్న టీమ్స్‌ ఎక్కువ విజయాలు సాధించడం.. ఇలా అన్ని ఆర్సీబీకి అనుకూలంగా జరుగుతున్నాయి. ఇదంతా చూస్తేంటే.. ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు పంపేందుకు దేవుడి పక్కా స్కెట్‌ వేశాడని క్రికెట్‌ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే.. ఇదే మ్యాజిక్‌ మరి కొన్ని మ్యాచ్‌ల్లో కూడా జరిగి.. ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, సీఎస్‌కే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, లక్నో కూడా ఓడిపోతే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి ఆర్సీబీకి అంతా అనుకున్నది అనుకున్నట్లు కలిసిరావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​

Show comments