Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ నాడు నిజంగానే బంగారం కొనాలా.. ఎలా మోసం చేస్తారో తెలుసా..!

అక్షయ తృతీయ నాడు నిజంగానే బంగారం కొనాలా.. ఎలా మోసం చేస్తారో తెలుసా..!

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కలసి వస్తుందని నమ్మే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. మరి నిజంగానే అక్షయ తృతీయ నాడు గోల్డ్‌ కొనాలా.. ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటే..

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కలసి వస్తుందని నమ్మే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. మరి నిజంగానే అక్షయ తృతీయ నాడు గోల్డ్‌ కొనాలా.. ఎలాంటి మోసాలు జరుగుతాయి అంటే..

బంగారం అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సందర్భం దొరికిన ప్రతి సారి ఎంతో కొంత గోల్డ్‌ కొంటారు. మన దేశంలో పసిడిని స్వయంగా అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుకే పండుగలు, శుభకార్యాల వేళ కచ్చితంగా ఎంతో కొంత పుత్తడి కొంటారు. ఇక గత కొన్ని రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. దాంతో గోల్డ్‌ కొనేవారి సంఖ్య కాస్త తగ్గింది. కానీ త్వరలోనే అక్షయ తృతీయ రానుండటంతో.. బంగారం కొనుగోళ్లు పెంచుకోవడం కోసం.. జ్యువెలరీ షాపులన్ని భారీ ఎత్తున​ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం అనే సంప్రదాయం ఈ మధ్య కాలంలో వచ్చింది. మరి నిజంగానే అక్షయ తృతీయ నాడు గోల్డ్‌ కొంటే కలిసి వస్తుందా.. పండుగ పేరిటి ఎలాంటి మోసాలు జరుగుతాయో తెలియాలంటే ఇది చదవాలి.

వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. మహాభారతంలో ధర్మరాజు సూర్యుడిని ఆరాధించి.. అక్షయ పాత్రను పొందిన రోజు ఇదేననీ.. అందువల్ల దాన్ని అక్షయ తృతీయ అంటున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శించి కుచేలుడు అనంతమైన సంపదలు పొందినది కూడా ఈరోజునే అని మరి కొందరు నమ్ముతారు. ఏది ఎలా ఉన్నా ఈ రోజున వారందరికి కలసి వచ్చింది కనుక.. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే.. కలిసి వస్తుందని.. లక్ష్మీ దేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందనే నమ్మకం జనాల్లో పాతుకుపోయింది. అయితే నిజంగానే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కలసి వస్తుందా అంటే.. అలా అని ఎక్కడా చెప్ప లేదని.. బంగారం కొనుగోలు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు అంటున్నారు పండితులు. ఇది కేవలం వ్యాపారులు తమ బిజినెస్‌ పెంచుకోవడానికి ప్రారంభించిన ఎత్తుగడ అని చెబుతున్నారు.

గుడ్డిగా నమ్మితే భారీగా లాస్‌..

అక్షయ తృతీయకు బంగారం కొంటే మంచి జరుగుతుందని నమ్మి.. ఎంతో కొంత గోల్ట్‌ కొనే ట్రెండ్‌ ఈ మధ్య కాలంలో ప్రారంభం అయ్యింది. ఓ దశాబ్దం క్రితం వరకు కూడా ఇలాంటి నియమం దక్షిణాదిలో అయితే లేదు. ఈమధ్య కాలంలోనే ఈ ట్రెండ్‌ పెరుగుతుంది. ఒకరిని చూసి ఒకరు గుడ్డిగా ఆచరిస్తున్నారు అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. పైగా కస్టమర్లను ఆకర్షించడం కోసం అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెలరీ షాపులు భరాఈ ఎత్తున ఆఫర్లు ఇస్తాయని.. వాటిని గుడ్డిగా నమ్మి కొంటే.. భారీగా నష్ట పోతారని హెచ్చిరిస్తున్నారు.

ఆఫర్లకు ఆకర్షితులై ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టం వేలల్లో, లక్షల్లో ఉంటుంది అంటున్నారు. చాలా మంది.. బంగారానికి పసుపురంగు అధికంగా వచ్చేలా రసాయనాలను వాడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోల్డ్‌ శాతం తక్కువగా ఉన్నా.. 22 క్యారెట్లు ఉందని చెప్పి డబ్బు వసూలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయని.. ఆఫర్ల హడావుడిలో పడి చాలామంది గుడ్డిగా మోసపోతారని చెబుతున్నారు. అందుకే బంగారం కొనేముందు ఒకటికి పది సార్లు చెక్‌ చేసుకుని తీసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాక అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోళ్ల మీద భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తారని.. ఒకసారి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. గోల్డ్‌ కొంటే కొందరు బంగారం, వెండి ఉచితంగా ఇస్తారని.. దీని వల్ల షాపు వారికి నష్టమే కదా.. అయినా ఎందుకు ఇస్తున్నారనే దాని గురించి జాగ్రత్తగా ఆలోచించమని సూచిస్తున్నారు. చాలా వరకు బంగారం రేటు పెంచి ఆ డబ్బుని ఆఫర్లో కలిపేస్తుంటారు. కనుక ఆఫర్ల మోజులో పడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు. బంగారం కొంటే కలిసి వస్తుందనే అపోహతో.. అప్పు చేసి మరి గోల్డ్‌ కొంటారని.. కానీ అంత అవసరం లేదని అంటున్నారు. కనుక మీ చేతిలో డబ్బులుంటే కొనండి.. లేదంటే కామ్‌గా ఉన్నంత ఉత్తమం లేదు అంటున్నా

Show comments