‘అఖిల్ 4’ సినిమా టైటిల్ ఖరారు

‘అఖిల్ 4’ సినిమా టైటిల్ ఖరారు

  • Published - 12:55 PM, Sun - 2 February 20
‘అఖిల్ 4’ సినిమా టైటిల్ ఖరారు

అఖిల్ అక్కినేని నాల్గవ సినిమా టైటిల్ ఖరారైపోయింది. అయితే అనౌన్సుమెంటుకి మాత్రం ముహూర్తం నిర్ణయించారు. ఎల్లుండి అనగా 4 వ తేదీ సాయంత్రం 5:15 కి చెబుతారట.

బొమ్మరిల్లు భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. బొమ్మరిల్లు, పరుగు తర్వాత తీసిన ఆరంజ్, ఒంగోల్ గిత్త రెండూ బాక్సీఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మెగాఫోన్ పట్టుకుని ప్రిన్స్ అఖిల్ సినిమా తీసున్నాడు.

గోపి సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్. ఇంకేం ఇంకేం కావాలే లాంటి పాట ఒకటి ముందుగా వదిలితే ఈ సినిమా మీద క్రేజ్ తీసుకురావచ్చు. క్రేజ్ తీసుకురావాల్సిన అవసరం ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ కి, అఖిల్ కి ఇద్దరికీ రీసెంట్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా లేవు. కాబట్టి ఏదో ఒక పుల్ ఫ్యాక్టర్ అవసరం చాలా ఉంది.

ఇక విషయానికొస్తే టైటిల్, పోస్టర్, ట్రైలర్…ఈ మూడూ ఆడియన్స్ ని థియేటర్సుకి లాక్కొచ్చే విషయాలు. ముందుగా టైటిల్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

Show comments