Actress Sana: భర్తకు గుండెపోటు.. నన్ను క్షమించండి అంటూ నటి సన పోస్ట్!

భర్తకు గుండెపోటు.. నన్ను క్షమించండి అంటూ నటి సన పోస్ట్!

బుల్లితెర, వెండితెరపై రాణిిస్తోన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. అయితే కొన్ని రోజుల నుండి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో నెటిజన్లు..

బుల్లితెర, వెండితెరపై రాణిిస్తోన్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. అయితే కొన్ని రోజుల నుండి ఎటువంటి అప్డేట్ లేదు. దీంతో నెటిజన్లు..

వెండితెరపై, బుల్లితెరపై రాణిస్తున్న అతికొద్ది మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు సన. ఆమె అసలు పేరు సనా బేగం. స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్లపై నటించింది. తెలుగు మాత్రమే కాదు తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పటికే 200 సినిమాలకు పైగా నటించింది. మోడల్‌గా కెరీర్ స్టార్ చేసిన ఆమె.. చిన్న వయస్సులోనే తల్లి, అత్త, వదిన పాత్రల్లో మెప్పించింది. గ్లామరస్ పాత్రలకు నో చెప్పడంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. అలాగే ఇన్‌స్టా గ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. కొడుకులు, మనవళ్లతో దిగిన ఫోటోలు, షూటింగ్స్ ఇతర వివరాలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూ ఉంటుంది.అయితే కొన్ని రోజుల నుండి ఇన్ స్టా ఖాతాలో ఎలాంటి పోస్టులు రావడం లేదు.

రంజాన్ ప్రారంభం అయిన దగ్గర నుండి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది సన. రంజాన్ రోజున కూడా ఎలాంటి విషెస్ కూడా పెట్టలేదు. తీరా ఏం అయ్యిందని అడిగితే అప్పుడు ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్టు కూడా కనిపించడం లేదు. ఇక అందులో ఇలా రాసుకొచ్చింది. ‘ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండనందుకు నన్ను క్షమించండి. దురదృష్టవ శాత్తు నా భర్తకు ఇటీవల హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అల్లా దయ వల్ల సర్జరీ అయ్యింది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. మీ అదరాభిమానాలు మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా..ధాంక్యూ’ అంటూ ఉగాది, రంజాన్ విషెస్ తెలియజేసింది సన. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.

కాగా, రంజాన్ పండుగ వేళ సన ఇంట్లో విషాదం నెలకొంది. ఆమెకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కను కోల్పోయింది. రాక్సీ అనే కుక్క చనిపోవడంతో బాధతో మిస్ అవుతున్నట్లు చెప్పింది. డాగ్ ఫోటోను షేర్ చేసిన సన.. నువ్వు ఎప్పుడు మా మదిలో ఉంటావ్ అంటూ రాసిన  పోస్టర్‌ను పంచుకుంది. భర్తకు కాస్త మెరుగు పడిందనుకున్న సమయంలో తమ ఇంట్లో మనిషిలా మెసిలిన కుక్కను కోల్పోవడంతో ఆ కుటుంబం బాధలో ఉంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. నిన్నే పెళ్లాడతా మొదలుకుని.. మంచి గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేసింది. ఎక్కువగా హీరోయిన్లకు తల్లిగా నటించింది. తమిళ డబ్బింగ్ మూవీ వీడింతేలో నెగిటివ్ రోల్ చేసి.. వావ్ అనిపించుకుంది.

Show comments