నర్సు రూపంలో మానవ మృగం..17 మంది రోగులను చంపినందుకు 700 ఏళ్లు జైలు శిక్ష

నర్సు రూపంలో మానవ మృగం..17 మంది రోగులను చంపినందుకు 700 ఏళ్లు జైలు శిక్ష

అధిక మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి ఏకంగా 17 మంది ప్రాణాలు తీసిన ఓ నర్సు చేసిన నేరంలో తాజాగా కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ నేరాలకు పాల్పడిన ఘటనలో కోర్టు ఆమెకు తీవ్ర కఠిన శిక్షను విధించింది.

అధిక మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి ఏకంగా 17 మంది ప్రాణాలు తీసిన ఓ నర్సు చేసిన నేరంలో తాజాగా కొన్ని ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ నేరాలకు పాల్పడిన ఘటనలో కోర్టు ఆమెకు తీవ్ర కఠిన శిక్షను విధించింది.

ఇన్సులిన్ ఇంజెక్షన్.. సాధారణంగా దీనిని డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి చికిత్సను అందించి ప్రాణాలు కాపాడేందుకు ఉపాయోగిస్తాం. అయితే ఏ ఇంజెక్షన్ అయిన మోతాదుకు మించి ఇవ్వడం ప్రాణాలకు ప్రమాదం అనే విషయం తెలిసిందే. అందుకే ఆసుపత్రిలో ఉన్న రోగులకు డాక్టర్ సలహా మేరకే అక్కడ ఉన్ననర్సులు వైద్యం అందించాలి. కానీ, ఓ నర్సు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. అసలు ఆసుపత్రిలో వైద్యులు తర్వాత అన్ని తామై కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ నర్సు..పేషెంట్ల పట్ల క్రూరంగా ప్రవర్తించింది. పేషెంట్ల ప్రాణాలను కాపాడాల్సిన ఆ నర్సే.. అధిక మోతాదులో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి 17 మంది పేషెంట్ల ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఈ సంచలన ఘటన అమెరికాలో గతేడాది చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఉన్న కొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

డయాబెటిస్ పేషెంట్ల ప్రాణాలు కాపాడాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్ తో ఓ నర్సు ఏకంగా 17 మంది ప్రాణాలను తీసేసింది. అయితే అధిక తాదుకు మించి ఇన్సులిన్ ఇవ్వడం వలన 17 మంది పేషెంట్ల ప్రాణాలు పోయాయి. అయితే ఇలా 17 మంది పేషెంట్ల ప్రాణాలను తీసేసిన సంచలనమైన ఘటన అమెరికాలో గతేడాది చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనకు పాల్పడిన నర్సు పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ప్రెస్ డీ (41) అనే మహిళనని విషయం తెలిసిందే. ఇక ఇన్సులిన్ తతో 19 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు గతంలో తానే ఒప్పుకుంది. అందుకు పోలీసులు ఆమెను గతేడాది నవంబర్ లో అరెస్ట్ కూడా చేశారు. కాగా, ఈ నేరానికి పాల్పడిన ఆ నర్సుకు అమెరికాలోని ఒక కోర్టు 700 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించింది.

అయితే  ఈ కేసులో హీథర్ ప్రెస్‌డీ మొదట 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇవ్వగా.. అందులో 17 మంది మరణించారు. ఇక 2020 నుంచి 2023 మధ్య ఐదు ఆరోగ్య కేంద్రాలలో రోగులకు ప్రెస్‌డీ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసింది. కాగా, అక్కడ కూడా మరో ముగ్గురిని హత్య చేసిందని, అలాగే మరో 19 మందికి హత్య చేయడానికి ప్రయత్నించినట్లు ఆమె విచరణలో అంగీకరించింది. దీని ఫలితంగా ఇంతటి ఘోరానికి పాల్పడిన హీథర్ కు కోర్టు 700 సంవత్సరాలకు పైగా జైలు శిక్షవిధించింది. అయితే ఆమె బారిన పడిన వారిలో ఎక్కువ శాతం 43 నుంచి 104 సంవత్సరాల వయసు గల వారు ఎక్కువగా ఉన్నారు. కాగా, ఇన్సులిన్ అధిక మోతాదు ఇవ్వడం ద్వారా హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. పైగా ఇది గుండె వేగాన్ని పెంచడంతో గుండెపోటు కూడా వస్తుంది.

ఇక ఇంతటి ఘోరాలకు పాల్పడిన హీథర్ ప్రవర్తన గురించి ఆమె సహా ఉద్యోగులకు అడిగారు. అయితే ఆమె రోగుల పట్ల ద్వేషంగా మాట్లాడేదని, తరుచు రోగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తుందని వారు చెప్పారు. ఇక హీథర్ తన తల్లికి పంపించిన మెసేజ్ ల్లో కూడా తన చుట్టూ ఉన్నవారు, రోగులు నచ్చడం లేదని చెప్తుండేదని వారు పేర్కొన్నారు. కాగా, ఆమెకు ఎలాంటి జబ్బు లేదని, మానసిక స్థితి బాగానే ఉందని బాధితురాలి కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు. మరి, అధిక మోతాదులలో ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసి రోగుల ప్రాణాలు తీసిన నర్సుకు కోర్టు 700 సంవత్సరాలు జైలు శిక్షవిధించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments