రైల్వేలో 9 వేల పైగా ఉద్యోగాలు! కాస్త కష్టపడితే జాబ్ మీదే.. పూర్తి వివరాలు ఇవే

రైల్వేలో 9 వేల పైగా ఉద్యోగాలు! కాస్త కష్టపడితే జాబ్ మీదే.. పూర్తి వివరాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రైల్వే శాఖలోని 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రైల్వే శాఖలోని 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది.

ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఎంతో మంది యువత లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకు తగినట్లుగానే రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తరచూ ఉద్యోగాలకు సంబంధించి ఏదో ఒక నోటిఫికేషన్ విడుదలవుతుంటాయి. తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖలో తొమ్మిది వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలానే ఈ దరఖాస్తు ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. మరి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం  ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రైల్వే మంత్రిత్వశాఖ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. రైల్వే శాఖలోని 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానించింది. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే గడవు త్వరలో ముగియనుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రైల్వే శాఖలోని ఈ టెక్నీషియన్ పోస్టులకు ఏప్రిల్‌ 8వ తేదీ రాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 ఆర్‌ఆర్‌బీల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.rrbapply.gov.in/#/auth/landing  క్లిక్ చేయండి. ఇక నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నోటిఫీకేషన్ లో మొత్తం 9,144 ఉద్యోగాలు ఉండగా.. వీటిలో టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సిగ్నల్‌ 1092 పోస్టుల ఉన్నాయి. అలానే టెక్నీషియన్‌ గ్రేడ్‌ 3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. మొత్తంగా 9,144 పోస్టులకు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.

వయో పరిమితి:

ఈ పోస్టులకు సంబంధించి వయో పరిమితి విషయానికి వస్తే.. టెక్నీషియన్ గ్రేడ్‌ 1 సిగ్నల్‌ పోస్టులకు జులై 1,2024 నాటికి 18 నుంచి 36 ఏళ్లు ఉండాలి. అలానే టెక్నీషియన్ గ్రేడ్‌ 3 పోస్టులకు జులై 1,2024 నాటికి 18 నుంచి 33 ఏళ్లు మించరాదు. అయితే ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు.. ఆయా కేటగిరీల వారికి వయో సడలింపు కల్పించారు.

దరఖాస్తు ఫీజు:

ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు రూ.500 పీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష రాసిన తరువాత 500లో నుంచి రూ.400 రిఫండ్‌ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ,ఎక్స్‌సర్వీస్‌మెన్‌,మహిళలు,థర్డ్‌జెండర్‌,మైనార్టీలు, ఈబీసీలు రూ.250 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి మాత్రం పరీక్ష తర్వాత ఫీజు మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు.

ఎంపిక విధానం:

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధృవీకరణ పత్రాల పరిశీలన అనంతరం మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతం:

టెక్నీషియన్‌ గ్రేడ్‌ -1 సిగ్నల్‌ పోస్టులకు 7 సీపీసీలో లెవెల్‌-5 కింద ప్రారంభ జీతం రూ.29,200 ఉంటుంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్‌-3 పోస్టులకు లెవెల్‌ -2 కింద రూ19,990 చొప్పున జీతం ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు.. విద్యార్హతలు, వయో పరిమితి, జోన్‌ల వారీగా పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, సిలబస్‌ వంటి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

Show comments