90s A Middle Class Biopic Web Series Review: ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ!

90s Web Series Review: 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ!

#90s A Middle Class Biopic Web Series Review & Rating in Telugu: 1990ల నాటి పరిస్థితులకు అద్దం పడుతూ తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

#90s A Middle Class Biopic Web Series Review & Rating in Telugu: 1990ల నాటి పరిస్థితులకు అద్దం పడుతూ తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ గురించి ఎన్ని సినిమాలు వచ్చినా.. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. కథలో కొత్తదనం ఉన్నా లేకపోయినా.. కనెక్టింగ్‌ పాయింట్‌ ఉంటే చాలు.. ప్రజలు బ్రహ్మరథం పట్టేస్తారు. కేవలం సినిమాలే కాదు.. వెబ్‌ సిరీస్‌లు అయినా సరే నెత్తిన పెట్టుకుంటారు. మిడిల్‌ ఫ్యామిలీ కష్టాలకు కొంచెం కామెడీ తోడైతే.. ఆ కథ కచ్చితంగా హిట్టు అవుతుందన్నది నిర్వివాదాంశం. ఇదో బెస్ట్‌ ఫార్ములా కూడా. తాజాగా, ‘90స్‌ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ పేరిట ఓ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివాజీ, వాసుకీ ఆనంద్‌ సాయి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 5వ తేదీనుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లేదా?

కథ :

చంద్రశేఖర్‌( శివాజీ) గవర్నమెంట్‌ స్కూల్లో లెక్కల మాస్టారుగా పని చేస్తూ ఉంటాడు. ఇతడిది మిడిల్‌ క్లాస్‌ కుటుంబం. భార్య రాణి( వాసుకీ ఆనంద్‌ సాయి), ముగ్గురు పిల్లలు రఘు( మౌళి తనూజ్‌ ప్రశాంత్‌), దివ్య ( వాసంతిక), ఆదిత్య( రోహన్‌ రాయ్‌)లతో కలిసి ఓ ఇంట్లో ఉంటాడు. తాను పని చేసేది గవర్నమెంట్‌ స్కూల్లో అయినా.. పిల్లలు బాగా చదువుకోవాలని వారిని ప్రైవేట్‌ స్కూల్లో చేర్చుతాడు. పెద్ద కొడుకు, కూతురు చదువుల్లో బాగా ఉంటారు. చిన్న కొడుక్కు చదువు అస్సలు రాదు. రఘు క్లాస్‌మేట్‌ సుచిత్ర(స్నేహాల్‌ కామత్‌)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం పరితపిస్తుంటాడు. రఘు తల్లిదండ్రులు అతడు పదవ తరగతిలో ఫస్ట్‌ ర్యాంకు సాధిస్తాడని ఆశిస్తూ ఉంటారు. రఘు టెన్త్‌లో జిల్లా ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించాడా? రఘు, సుచిత్రల లవ్‌ స్టోరీ ఏమైంది? మధ్యలో ఉప్మా స్టోరీ ఏంటి? అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ :

జనరేషన్‌, జనరేషన్‌కు మధ్య ఉన్న గ్యాపు కేవలం సంవత్సరాలనే కాదు.. అనుభవాలను కూడా వెనకేసుకుంటూ వెళుతుంది. ఇప్పటి 2కే కిడ్స్‌కు ఏమాత్రం ఊహకందని మానసిక, శారీరక ఆనందం 90స్‌ కిడ్స్‌ సొంతం. ఈ పాయింట్‌ బేస్‌ చేసుకుని అప్పటి మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ చుట్టూ కథ అల్లుకున్నాడు దర్శకుడు ఆధిత్య హాసన్‌. ఫ్యామిలీ డ్రామాలో ఉండాల్సిన ఎలిమెంట్స్‌ మొత్తం 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో కనిపిస్తాయి. మధ్య తరగతి కుటుంబ సభ్యుల ఆలోచనలు.. ఆర్థిక పరిస్థితులు, అలకలు, గొడవలు అన్నీ మామూలుగానే ఉన్నాయి. కథ కొత్తది కాకపోయినా 90స్‌ అన్న పాయింట్‌తో కనెక్ట్‌ అయిపోతుంది. చదువుల కోసం పోరు పెట్టే తల్లిదండ్రులు.. చదువురాని కొడుకు. స్కూల్‌ టైం లవ్‌.. తండ్రీ కొడుకుల మధ్య ర్యాపో ఈ అంశాలన్నీ చాలా మందికి కనెక్ట్‌ అవుతాయి.

నటీనటుల పనితీరు :

ఈ వెబ్‌ సిరీస్‌లో ‍ప్రధాన పాత్రలైన శివాజీ, వాసుకీ నటించారు అనటం కంటే జీవించారు అని అనటం బాగుంటుంది. శివాజీ పాత్ర సగటు మధ్య తరగతి కుటుంబ పెద్దను గుర్తు చేస్తుంది. వాసుకీ ఇంటి ఇల్లాలు పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన ప్రధాన పాత్రల్లో మౌళి తనూజ్‌ ప్రశాంత్‌, వాసంతిక, రోహన్‌ రాయ్‌లు బాగా చేశారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ పరిధికి తగ్గట్టు నటించారు.

టెక్నీకల్ విభాగం :

90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కామెడీ, ఎమోషన్స్‌తో నడుస్తూ ఉంటుంది. పరిస్థితికి తగ్గట్టు సురేష్‌ బొబ్బిలి మంచి నేపథ్యం సంగీతాన్ని అందించారు. కొన్ని సీన్లలో బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటాం కూడా. ఇక, సినిమాటోగ్రాఫర్‌ అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టారు. ప్రతీ సీన్‌ మన కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. ఇక, ఎడిటింగ్‌ విషయానికి వస్తే.. శ్రీథర్‌ సోమ్‌పల్లి తన కత్తెరకు ఎంత వరకు అవసరమో అంత వరకు పని చెప్పారు.

ప్లస్‌లు :

  • కథ
  • కామెడీ
  • ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌లు

  • స్క్రీన్‌ ప్లే సరిగా లేదు

చివరిమాట : 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్.. 90స్‌ కిడ్స్‌కు నచ్చే కథ!

రేటింగ్‌ : 3/5

Show comments