IPL 2024: 12 ఏళ్ల సెంటిమెంట్‌.. మళ్లీ రిపీట్‌ అయితే వాళ్లదే కప్పు!

IPL 2024: 12 ఏళ్ల సెంటిమెంట్‌.. మళ్లీ రిపీట్‌ అయితే వాళ్లదే కప్పు!

ఓ క్రేజీ సెంటిమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా 12 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ కావడంతో.. ఈసారి మళ్లీ అదే టీమ్ కప్ కొడుతుందంటూ నెట్టింట ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ సెంటిమెంట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ క్రేజీ సెంటిమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా 12 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ కావడంతో.. ఈసారి మళ్లీ అదే టీమ్ కప్ కొడుతుందంటూ నెట్టింట ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ సెంటిమెంట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా మారింది. గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడుతున్నాయి.. ఓడుతాయి అనుకున్న టీమ్స్ అనూహ్యంగా దుమ్మురేపుతున్నాయి. ఈ సీజన్ లో రాజస్తాన్, కోల్ కత్తా, లక్నో, సన్ రైజర్స్ టీమ్స్ ప్రస్తుతం టాప్ ఫోర్ లో కొనసాగుతున్నాయి. అయితే రాజస్తాన్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. కోల్ కత్తా ఇంకో అడుగుదూరంలో మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ సెంటిమెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా 12 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ కావడంతో.. ఈసారి మళ్లీ అదే టీమ్ కప్ కొడుతుందంటూ నెట్టింట ఓ పోస్ట్ వైరల్ గా మారింది. మరి 12 ఏళ్ల సెంటిమెంట్ ఏంటి? కప్ కొట్టేది ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్ కత్తా నైట్ రైడర్స్ టీమ్స్ వాంఖడే వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కేకేఆర్ 24 రన్స్ తో విజయం సాధించింది. దీంతో ముంబై 12 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న క్రేజీ రికార్డ్ తాజాగా బద్దలైంది. 12 సంవత్సరాలుగా ముంబైని వాంఖడే స్టేడియంలో ఓడించలేదు కేకేఆర్. కానీ ఈ మ్యాచ్ లో ఓడించడంతో.. ఆ రికార్డ్ కాస్త బ్రేక్ అయ్యింది. ఇక పాండ్యా కెప్టెన్సీలోనే ఇలా కావడంతో ఫ్యాన్స్ హార్దిక్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఓ క్రేజీ సెంటిమెంట్ ఐపీఎల్ లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? సరిగ్గా 12 సంవత్సరాల క్రితం అంటే.. 2012లో కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. ఆ సీజన్ లో ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి.. ఛాంపియన్స్ గా నిలిచింది కేకేఆర్ టీమ్. ఇక ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత అదే వాంఖడే లో ముంబైని ఓడిచింది కేకేఆర్. దీంతో 12 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ కావడంతో.. ఈసారి కూడా కోల్ కత్తానే ఛాంపియన్స్ గా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయాపడుతున్నారు. కాగా.. ఈ సీజన్ లో కేకేఆర్ టీమ్ అద్భుతమైన ఫర్ఫామెన్స్ చూపిస్తూ ముందుకుసాగుతోంది. దీంతో వారి ఆటకు ఈ సెంటిమెంట్ తోడైతే.. కేకేఆర్ కప్ కొట్టినా ఆశ్చర్యం లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ప్రకారం నిజంగానే కేకేఆర్ కప్ కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments