YSRCP Bus Touer: ఉత్తరాంధ్రలో YSRCP బస్సు యాత్ర ప్రారంభం.. షెడ్యూల్ ఇదే!

ఉత్తరాంధ్రలో YSRCP బస్సు యాత్ర ప్రారంభం.. షెడ్యూల్ ఇదే!

ఏపీలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధం స్థాయి మరింత పెరిగింది. ఇక అధికార పార్టీ  వైసీపీ వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి  దూసుకెళ్తుంది. ఇటీవలే విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కార్యకర్తలకు, నేతలు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బస్సుయాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తొలుత ఉత్తరాంధ్రలో ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని ఆయన వివరించారు. అన్ని వర్గాలకు రాజ్యాధికారం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోందని,  అన్ని ముఖ్యమైన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని బొత్స తెలిపారు.

చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, బాబు కుటుంబ సభ్యుల సూచనలు కోర్టు పరిగణలోకి తీసుకుంటే అచరిస్తామని మంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే పార్టీ వైఎస్సార్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని, విశాఖ కేంద్రంగా పాలనను ఉత్తరాంధ్ర ప్రజలు మనస్పూర్తిగా కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.సామర్ల కోట సభలో సీఎం జగన్‌ వాస్తవాలే మాట్లాడారని, వ్యక్తి గత దూషణలు చేయలేదని ఆయన తెలిపారు లోకేష్ అమిత్ షాను కాదు అమితాబ్‌ను కలిసినా తమకు అభ్యంతరం లేదని, చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారు కానీ వ్యక్తి గతం కాదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

అదే విధంగా ఉత్తరాంధ్ర బస్సుయాత్ర షెడ్యూల్ ను మంత్రి బొత్స ప్రటించారు. అక్టోబర్ 26న ఇచ్చాపురంలో ఈ బస్సు యాత్ర ప్రారంభవుతుంది. అనంతరం 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస జరగనుంది. అలానే నవంబర్ 1 పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభమవుతుంది. నవబంర్ 1న పార్వతీపురం, నవంబర్ 2న మాడుగుల,3ననరసన్నపేట, 4నఎస్.కోట, 6న గాజువాక, 7న రాజాం, నవంబర్ 8న సాలూరు, నవంబర్ 9అనకాపల్లిలో ఈ బస్సు యాత్ర జరగనుంది.

Show comments