YS Vimala-Sharmila, Sunitha, Viveka case: YS సోదరి విమల సంచలన వ్యాఖ్యలు.. ’షర్మిల, సునీత చేస్తుంది పెద్ద తప్పు‘

YS సోదరి విమల సంచలన వ్యాఖ్యలు.. ’షర్మిల, సునీత చేస్తుంది పెద్ద తప్పు‘

YS Vimala: వైఎస్ షర్మిల, సునీతల మీద వైఎస్సార్ సోదరి విమల సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి తీరును తప్పు పట్టారు. ఆ వివరాలు..

YS Vimala: వైఎస్ షర్మిల, సునీతల మీద వైఎస్సార్ సోదరి విమల సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి తీరును తప్పు పట్టారు. ఆ వివరాలు..

గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల, వివేకా కూతురు సునీత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామాలపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమల విరుచుకుపడ్డారు. వైఎస్ ఇంటి ఆడబిడ్డలు అన్యాయంగా మాట్లాడుతున్నారని.. కుటుంబం పరువును రోడ్డు మీదకు లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీతలు వివేకా కేసులో నిత్యం అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని.. తమ ఇంటి ఆడ బిడ్డలే ఇలా మాట్లాడి కుటుంబాన్ని అల్లరి పాలు చేయడం చూస్తే చాలా బాధగా ఉందన్నారు. ఆమె మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

వైఎస్‌ విమల శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా ఇంటి ఆడబిడ్డలు కుటుంబం పరువును రోడ్డు మీదకు లాగుతున్నారు. వారి మాటలను నేను భరించలేకపోతున్నాను. నేనూ ఆ ఇంటి ఆడపడుచుగానే మాట్లాడుతున్నా. షర్మిల కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతున్న వీడియో చూసాను. అసలు షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవు. సునీత, షర్మిల నిత్యం అవినాష్ ను విమర్శిస్తున్నారు. తను హత్య చేయడం వీరిద్దరూ చూశారా.. సీఎం జగన్‌ను కూడా దీంట్లోకి లాగుతున్నారు. వివేకాను చంపింది ఎవరో వాళ్లే డిసైడ్ చేసేస్తే ఇంకా జడ్జీలు, కోర్టులు ఎందుకు. హత్య చేసినవాడు బయట తిరుగుతున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మి అవినాష్ రెడ్డిని విమర్శిస్తారా‘‘ అని మండి పడ్డారు.

’’వివేకం అన్న అంటే షర్మిల, సునీత కంటే నాకే ఎక్కువ ఇష్టం. వీళ్లద్దరి వల్ల కుటుంబసభ్యులంతా ఏడుస్తున్నారు. జగన్ పై వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు. రాజారెడ్డిని చంపినపుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ప్రాంతంలో అల్లర్లు రేపుతున్నారు. మేనత్తగా చెప్తున్నా మీ ఇద్దరూ నోరు మూసుకోండి. షర్మిల, సునీత చేసేది చాలా తప్పు. మా కుటుంబ సభ్యులు ఎవరు వీరి తీరును ఆమోదించడం లేదు. వీరిద్దరి వల్ల మా ఫ్యామిలీ అంతా బాధపడుతుంది. ఇద్దరు నాతో మాట్లాడటం మానేశారు‘‘ అని చెప్పుకొచ్చారు.

’’జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండొద్దని.. వారందరిని దూరంగా పెట్టారు. వాళ్ల పనులు అవట్లేదనే ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నా. అవినాష్ రెడ్డి ఎదుగుతున్నాడని ఓర్చుకోలేకపోతున్నారు. మేనత్తగా చెబుతున్నా మీరు ఇప్పటికైనా మారండి.. నోళ్లు మూసుకోండి. అవినాష్ గెలవాలని వివేకా చివరి వరకు పని చేశారు. మంచి ఏదో చెడు ఏదో కడప ప్రజలు ఆలోచించాలి. అవినాష్, జగన్ లను గెలిపించాలి. షర్మిల చెప్పే సెంటిమెంట్ ను నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించాలి’’ అని విమల ఏపీ ప్రజల్ని కోరారు.

Show comments