Big Relief To Credit Card Users: క్రెడిట్ కార్డు కస్టమర్స్‌కి భారీ ఊరట.. ఇక చెల్లింపులు లేటైనా పర్లేదు..

క్రెడిట్ కార్డు కస్టమర్స్‌కి భారీ ఊరట.. ఇక చెల్లింపులు లేటైనా పర్లేదు..

ఒక్కోసారి క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మర్చిపోతాం. దీంతో బ్యాంకులు, ఆయా క్రెడిట్ కార్డులు జారీ సంస్థలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్ తో బిల్ పేమెంట్ లేటైనా గానీ బ్యాంకులు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. ఎన్ని రోజుల వరకూ ఈ రూల్ వర్తిస్తుందంటే?

ఒక్కోసారి క్రెడిట్ కార్డు డ్యూ డేట్ మర్చిపోతాం. దీంతో బ్యాంకులు, ఆయా క్రెడిట్ కార్డులు జారీ సంస్థలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి. అయితే ఆర్బీఐ తీసుకొచ్చిన రూల్ తో బిల్ పేమెంట్ లేటైనా గానీ బ్యాంకులు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. ఎన్ని రోజుల వరకూ ఈ రూల్ వర్తిస్తుందంటే?

క్రెడిట్ కార్డు తీసుకునేవరకూ ఒక గోల.. తీసుకున్నాక ఒక గోల. తీసుకునే వరకూ తీసుకోండి సార్ అని బ్యాంకుల వాళ్ళు తెగ ఫోన్లు చేస్తారు. తీరా తీసుకున్నాక ఒకరోజు ఆలస్యమైతే ఓవర్ డ్యూ ఛార్జెస్ వసూలు చేస్తారు. అంతకు ముందు రిక్వెస్ట్ గా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ ఎప్పుడు కడతారు? లేటైందే? అని కమాండింగ్ గా మాట్లాడతారు. కావాలని ఎవరూ మర్చిపోరు. కొంతమంది తేదీ గుర్తులేక మర్చిపోతారు. అయినా సరే అవన్నీ మాకెందుకండి.. డ్యూ డేట్ క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి.. కట్టకపోతే ఓవర్ డ్యూ ఛార్జీలు చెల్లించాల్సిందేనని అంటారు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఆర్బీఐ ఊరటనిచ్చింది. ఇకపై క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు ఆలస్యమైనా పర్లేదని.. టైం ఇవ్వాలని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డుల్ని ఎంచుకునే అధికారం వినియోగదారులకు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.

కస్టమర్స్ కి మల్టీపుల్ నెట్వర్క్ ఆప్షన్స్ ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. రూపే, మాస్టర్ కార్డ్, వీసా వంటి క్రెడిట్ కార్డ్స్ ని ఎంచుకునే అవకాశం కస్టమర్స్ కి ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ నిబంధన 2024 సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి రానుంది. ఇదిలా ఉంటే క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. మామూలుగా ప్రతి నెలా రూమ్ రెంట్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఈఎంఐలు, ఇంటర్నెట్ బిల్ ఇలా అనేక రకాల బిల్స్ ఉంటాయి. వీటితో పాటు క్రెడిట్ కార్డు బిల్లులు కూడా ఉంటాయి. అయితే ఈ బిల్లులు చెల్లించాల్సిన తేదీలని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. అందులోనూ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఇక అంతే సంగతి.

ఎందుకంటే ఒక్కో క్రెడిట్ కార్డుకి ఒక్కో డ్యూ డేట్ ఉంటుంది. మనకు ప్రతి నెలలో కూడా ఒకటో తేదీ వచ్చేసరికి చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో ఉంటాయి. రూం రెంట్ నుంచి మొదలుకొని, ఈఎంఐ, కరెంట్ బిల్, గ్యాస్, వాటర్, ఇంటర్నెట్ బిల్స్, పేపర్ బిల్, డీటీహెచ్ బిల్ వీటితో పాటు క్రెడిట్ కార్డుల బిల్స్ ఉంటాయి. వీటి గడువు తేదీలు ఎప్పుడున్నాయో అన్నీ గుర్తుంచుకోవడం కాస్త కష్టమే. ఇంకా ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటే ఒక్కో దానిపై పేమెంట్ డ్యూ డేట్ ఒక్కోలా ఉంటుంది. దీంతో డేట్స్ గుర్తులేక చాలా మంది డ్యూ డేట్ లోగా క్రెడిట్ కార్డు బిల్స్ చెల్లించలేకపోతున్నారు. దీంతో లేటు ఫీజు పడుతుందని క్రెడిట్ కార్డు యూజర్లు ఆందోళన చెందుతుంటారు. ఆయితే ఇకపై ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. కస్టమర్లకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ.. గ్రేస్ పీరియడ్ రూల్ ని తీసుకొచ్చింది.

ఈ రూల్ ప్రకారం.. డ్యూ డేట్ నాడు క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ మిస్ అయినా గానీ మూడు రోజుల వరకూ ఎలాంటి ఛార్జీలు వర్తించవు. ఈ విషయంలో మూడు రోజుల వరకూ కస్టమర్లకు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకులకు, క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డు బిల్ చెల్లించేందుకు యూజర్లకు 3 రోజుల అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అంటే మే 1న క్రెడిట్ కార్డు బిల్ డ్యూ డేట్ అయితే.. కస్టమర్లు మూడు రోజుల పాటు అంటే మే 4 వరకూ కూడా ఎలాంటి లేటు ఫీజు లేకుండా బిల్ పే చేయవచ్చు. అలానే లేట్ పేమెంట్ ఫీజు వంటివి.. మొత్తం క్రెడిట్ కార్డు అమౌంట్ మీద కాకుండా.. అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైనే విధించాలని ఆర్బీఐ వెల్లడించింది. మరి బ్యాంకు వాళ్ళు గానీ, క్రెడిట్ కార్డు జారీ చేసిన వాళ్ళు గానీ డ్యూ డేట్ కి కట్టలేదని ఫైన్ వేస్తే వారికి ఈ రూల్ గురించి చెప్పండి. అలానే ఈ కథనాన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నవారికి షేర్ చేయండి.        

Show comments