Weather department predicted rain in many districts in Telangana: రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ఇచ్చిన అప్ డేట్ తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ఇచ్చిన అప్ డేట్ తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ఇచ్చిన అప్ డేట్ తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కొతోలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో వర్షాలు కురిస్తే నష్టపోతామేమోనని కలవరపడుతున్నారు. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బంగాళాఖాతంపై ద్రోణి వరకు బలమైన తూర్పు, ఈశాన్య గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

తెలంగాణలో ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ-గద్వాల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలికాలం ప్రారంభమైనప్పటికీ ఆ ప్రభావం ఏమంతగా కనిపించడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు కాస్త పడిపోతున్నాయి.

Show comments