TS: నగరవాసులకు గుడ్‌న్యూస్.. తీరనున్న నీటి కష్టాలు, ఇక నో టెన్షన్..!

TS: నగరవాసులకు గుడ్‌న్యూస్.. తీరనున్న నీటి కష్టాలు, ఇక నో టెన్షన్..!

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నీటి వాడకం కూడా క్రమేపి పెరిగిపోయింది. అసలే వేసవి కాలం కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నీటి కొరత అనేది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సమస్యలపై దృష్టి సారించిన జల అధికారులు నగరవాసులకు ఓ గుడ్ న్యూస్ ను చెప్పారు.

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నీటి వాడకం కూడా క్రమేపి పెరిగిపోయింది. అసలే వేసవి కాలం కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ నీటి కొరత అనేది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ సమస్యలపై దృష్టి సారించిన జల అధికారులు నగరవాసులకు ఓ గుడ్ న్యూస్ ను చెప్పారు.

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభాతో పాటు నీటి వాడకం కూడా క్రమేపి పెరిగిపోయింది. దీంతో నగరంలోని ఎక్కడ చూసిన నీటి కొరత అనేది భారీగా కనిపిస్తోంది. ముఖ్యంగా వేసవిలో అయితే ఈ నీటి కొరత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. వేసవిలో అయితే నగరంలో నీటి ఎద్దటి అనేది భారీ స్థాయిలో ఉంటుంది. కనీసం రెండు రోజు విడిచి రోజుకు వచ్చే నల్లా నీళ్లు కూడా.. ఒక్కొక్కసారి రెండు రోజుల అయితే రాని పరిస్థితి ఏర్పడుతుంద. అసలే రానున్న రోజుల్లో మరింత ఏండాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మంచి నీళ్ల కొరత మరింత ఎక్కువయ్యేలా ఉంటుందోమో అని ప్రజలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.  అయితే వేసవిలో నీటి కొరత ఏర్పడం వలన ప్రజల పై ఆ ప్రభావం ఎక్కువగా చూపుతుందని ఆలోచించిన జల అధికారులు తాజాగా నగరవాసులకు ఓ గుడ్ న్యూస్ ను చెప్పారు.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో నీటి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తోంది. కాగా, గతేడాది వర్షాలు సరిగ్గా కురవకపోటవంతో.. భూగర్భజలాలు అన్నీ అడుగంటిపోయాయి. దీంతో బోర్లపై ఆధారపడినవారు ఈ నీటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అందుకోసం జీహెచ్‌ఎంసీ నుంచి వాటర్ ట్యాంకులు బుక్ చేసుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ జలమండలి అధికారులు నగరవాసులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అదే ఏమిటంటే.. .గ్రేటర్‌ వ్యాప్తంగా ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.  అంతేకాకుండా.. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీటి సరఫరాకు డిమాండ్‌ పెరిగిందన్నారు. కనుక ఆయా ప్రాంతాల్లో బోర్లపై ఆధారపడే వారంతా ప్రస్తుతం జలమండలి సరఫరా చేసే నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతుండటంతో ఒక్కసారిగా ఆ ప్రభావం పడిందని అన్నారు.

ఇక వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటునమని.. అలాగే అన్ని జలాశయాల నుంచి నగరానికి సరఫరా పెంచినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 553 ఎంజీడీలు సరఫరా చేయగా.. ప్రస్తుతం 575 ఎంజీడీలు అందిస్తున్నట్లు జల మండలి అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే గోదావరి, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, మంజీరాల నుంచి అదనపు జలాలను తరలించి నగరవాసుల అవసరాలు తీరుస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే వాటర్ ట్యాంకర్‌ బుకింగ్స్‌, సరఫరా కోసం జలమండలి ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందని, ఇక 3 షిప్టుల్లో రాత్రిళ్లు కూడా నీటిని సరఫరా చేస్తున్నామని అన్నారు. ఇకపోతే సరఫరా సమయాన్ని తగ్గించడం  వంటి చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు.

అయితే నగరంలో ట్యాంకర్ సరఫరా ఆలస్యమైతే ముందుగా సంబంధిత వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ (SMS) ద్వారా సమాచారం ఇస్తున్నామని జల మండలి అధికారులు తెలిపారు.  తద్వారా నీటి సరఫరాలో పారదర్శకత పాటిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే నీటి సరఫరాలో ఎలాంటి కోతలు పెట్టలేదని, ఒప్పందం చేసుకున్న దాని కన్నా 20 శాతం ఎక్కువే నీటిని సరఫరా చేస్తున్నామని జలమండలి అధికారులు పేర్కొన్నారు. మరి, హైదరాబాద్ నగరవాసులకు  నీటి సమస్యలపై శుభవార్తను చెప్పడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments