Gangs Of Godavari Movie Postponed: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ అవడానికి కారణాలు ఏంటి?

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పోస్ట్ పోన్ అవడానికి కారణాలు ఏంటి?

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఎందుకంటే..

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఎందుకంటే..

యువ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి పోస్ట్ పోన్ అయింది. నిజానికి 2023 డిసెంబర్లో ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే హాయ్ నాన్న, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను వాయిదా వేశారు. అయితే ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్ చేయనని విశ్వక్ ప్రకటించారు. అప్పట్లో ఈ విషయం పై కాస్త వివాదం కూడా చెలరేగింది.

ఆ తరువాత మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి “గామి”తో వస్తానని హీరో విశ్వక్ సేన్ నిన్న స్వయంగా ప్రకటించారు. దీంతో అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎందుకు మళ్ళీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని విశ్వక్ సేన్ మొన్ననే కన్ఫర్మ్ చేశారు. ఈషా రెబ్బాతో ఒక రోజు ఐటెం సాంగ్ షూట్ చేసి, ఆ తర్వాత షూట్ క్యాన్సిల్ చేసి, ఈషా స్థానంలో ఆయేషా ఖాన్ ను రంగంలోకి దింపారు. ఆ తర్వాత విశ్వక్ సేన్, నేహా శెట్టిలపై ఓ ఫైట్ సీక్వెన్స్, మరో పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే టెక్నికల్ టీం కుటుంబంలో జరిగిన ఓ మరణం ఈ సినిమా ఆలస్యానికి దారితీస్తోందని తెలుస్తోంది.

మాస్ కా దాస్ అని అభిమానులు పిలుచుకునే విశ్వక్ సేన్, తన సినిమాను బలవంతంగా అన్ని పనులు పూర్తవకుండా విడుదలకు నెట్టే ఒత్తిడిని తాను తీసుకోనని స్పష్టం చేశారు. అంతేకాక లెజెండరీ కంపోజర్ ఇళయరాజా కుమార్తె ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ చేదు సంఘటన తాలూకు ప్రభావం కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద పడింది. ఎందుకంటే ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తన సోదరి మరణం నుండి కోలుకోవడానికి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనిని పూర్తి చేయడానికి యువన్ మరింత సమయం కోరారట.

డీజే టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ ఇప్పటికే సమ్మర్ రిలీజ్ డేట్ లు ప్రకటించగా, ఇప్పుడు గోదావరి గ్యాంగ్స్ కల్కి 2898 AD సినిమాకి ముందు లేదా ఆ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది.

Show comments