Kesineni Nani Will Resign TDP Soon: చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం.. TDP కి గుడ్ బై

Kesineni Nani: చంద్రబాబుకు బిగ్ షాక్.. కేశినేని నాని సంచలన నిర్ణయం.. TDP కి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయవాడ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం తీసకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయవాడ ఎంపీ కేశినేని సంచలన నిర్ణయం తీసకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని.. ముందుకు సాగుతోంది. ఇక వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి.. ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు ప్రకటించాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు.. పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..

తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటూ పార్టీకి కూడా రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు కేశినేని. పార్టీ, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నప్పుడు.. తాను ఇంకా పార్టీలో ఉండటం కరెక్ట్ కాదన్నాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని పోస్ట్ చేశారు.

దీనిలో ‘అందరికి నమస్కారం.. చంద్రబాబు నాయుడు గారు తెలుగు దేశం పార్టీ కి నా అవసరం లేదు అని భావించిన తరువాత కూడా నేను పార్టీలో ఉండటం సరైంది కాదని నా అభిప్రాయం. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమెదింప చేయించుకుని.. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను’ అంటూ తన నిర్ణయం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ క్రమంలో కేశినేని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..”తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు.. అందుకే నేను వెళ్లడం లేదు. నా క్యారెక్టర్ ఎలాంటిదో అభిమానులకు తెలుసు.. అలానే వాళ్లు నా గురించి ఏం ఆలిచిస్తారో నాకు కూడా తెలుసు. అందుకే జరుగుతున్న పరిణామాలపై మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది. నేను టీడీపీ పార్టీకి ఓనర్‌ను కాదు. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడాతారో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ముగ్గురు పెద్ద మనుషులతో నాకు చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే. కానీ, ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు కదా” అని ప్రశ్నించారు.

స్వంతంత్ర అభ్యర్థిగా అయినా గెలుస్తాను..

నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. చంద్రబాబుకి నేను వెన్నుపోటు పొడవలేదు. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తాను. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీచేస్తా. కచ్చితంగా మూడో సారి గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

Show comments