అచ్చొచ్చిన అదే డేట్ కి విజయ్ 'గోట్' మూవీ.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

అచ్చొచ్చిన అదే డేట్ కి విజయ్ ‘గోట్’ మూవీ.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

విజయ్ దళపతి నటిస్తున్న గోట్ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విజయ్ దళపతి నటిస్తున్న గోట్ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ హీరో నటిస్తున్న సినిమా “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్”(ది గోట్). ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇక వీరితో పాటు.. జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, మైక్ మోహన్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాను తమిళంతో పాటూ తెలుగులో కూడా రిలీజ్ చేయడం విశేషం. విజయ్ దళపతికి కేవలం తమిళ్ లోనే కాకుండా.. ఇటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్నారు. దీనితో ఈ సినిమా కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజి అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాకు వేంకటేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కల్పాతి, కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా యువన్ శంకర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాను.. ఈ ఏడాది సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీనితో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. ఇంకా సినిమా రిలీజ్ కు కొద్దీ నెలలు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో .. షూటింగ్ పనులు వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్స్ తో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. మరి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

అయితే, ది గోట్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడం వెనుక ఓ ప్రత్యేకత ఉందంటూ.. విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అదేంటంటే.. శంఖర్ దర్శకత్వంలో వచ్చిన స్నేహితుడు సినిమాలో నలుగురు స్నేహితులు కలిసి టెర్రస్ పైన తాగుతూ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నపుడు.. సెప్టెంబర్ 5 వ తేదీ గుర్తుపెట్టుకో అంటూ ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు అదే సీన్ ను సోషల్ మీడియా లో షేర్స్ చేస్తూ.. ది గోట్ సినిమాతో సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రచ్చ చేస్తాం అంటున్నారు.. విజయ్ అభిమానులు.. ఇక సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో.. ఆ సమయంలో కేరళలో ఓనం సెలవలు ఉంటాయి. దీనితో ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా బాగా ప్లస్ అవుతుంది అంటూ లెక్కలేస్తున్నారు అభిమానులు. ఈసారి ది గోట్ తో విజయ్ హిట్ కొట్టడం పక్కా అని భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments