Vijay Deverakonda: రష్మిక ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్! పోస్ట్ వైరల్..

రష్మిక ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ రియాక్షన్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 10:01 PM, Wed - 8 November 23

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ఇండస్ట్రీ మెుత్తం భగ్గుమంటోంది. తాజాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు విజయ్ దేవరకొండ.

రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ఇండస్ట్రీ మెుత్తం భగ్గుమంటోంది. తాజాగా ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు విజయ్ దేవరకొండ.

  • Author Soma Sekhar Published - 10:01 PM, Wed - 8 November 23

టెక్నాలజీని ఎంత గొప్పగా వాడుకుంటే అన్ని అద్భుతాలు సృష్టించొచ్చు. అదే టెక్నాలజీని తప్పుగా వాడితే.. అది సృష్టించే వినాశనం చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయం ఇప్పుడిప్పుడే జనాలకు తెలిసివస్తోంది. తాజాగా నేనషల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనందరికి తెలిసిందే. ఇక ఈ వీడియోపై సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా ఘాటుగా స్పందించారు. బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్ టాలీవుడ్ నుంచి నాగచైతన్య, మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటుగా మరికొందరు నటీ, నటులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక రష్మిక ఫేక్ వీడియోపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు విజయ్ దేవరకొండ.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై ఇండస్ట్రీ మెుత్తం భగ్గుమంటోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ ఫేక్ వీడియో విషయంలో రష్మికకు అండగా నిలుస్తూ వస్తున్నారు సినీ పరిశ్రమకు చెందిన తారలు. అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, మంచు విష్ణు ఈ వీడియోను ఖండిస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా రష్మిక ఫేక్ వీడియోపై రియాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ.”ఇలాంటి దారుణాలకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్ లో మరో మహిళకు ఇలా జరగకుండా, వీటిపై తక్షణమే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సైబర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే మహిళలకు పూర్తి రక్షణ ఉంటుంది” అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు విజయ్.

కాగా.. రష్మిక డీప్ ఫేక్ వీడియో సంఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. భవిష్యత్ లో ఇలాంటి నేరాలను అరికట్టేవిధంగా హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఈ విధమైన వీడియోలు, ఫొటోలను 36 గంటల్లోగా తొలగించాలని కేంద్ర ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వశాఖ డీప్ ఫేక్ క్రియేషన్ వీడియోలు, సర్క్యూలేషన్ కు సంబంధించిన పెనాల్టీలు, నిబంధనలను గుర్తు చేస్తూ.. ఆయా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీని పంపించింది.

Show comments