Vicky Kaushal in Animal Park: యానిమల్ పార్క్ లో విలన్ గా విక్కి కౌశల్?

యానిమల్ పార్క్ లో విలన్ గా విక్కి కౌశల్?

Vicky Kaushal in Animal Park: ఇటీవల సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యనీమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ 'యానిమల్ పార్క్' బాలీవుడ్ క్రేజీ యాక్టర్ విలన్ గా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Vicky Kaushal in Animal Park: ఇటీవల సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యనీమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ 'యానిమల్ పార్క్' బాలీవుడ్ క్రేజీ యాక్టర్ విలన్ గా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

‘యానిమల్’ ఘన విజయం తర్వాత ఆ సినిమా సీక్వెల్ ‘యానిమల్ పార్క్’పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రణబీర్ కపూర్ తో మరోమారు ఇంటెన్స్ యాక్టింగ్ రాబడతానని హామీ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కాగా తాజాగా  వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ క్రేజీ సీక్వెల్ లో విక్కీ కౌశల్ ను విలన్ గా నటింపజేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే ఇది రూమర్ అయినప్పటికీ… ‘యానిమల్ పార్క్’ లో విక్కీ కౌశల్ – రణబీర్ కపూర్ మధ్య ముఖాముఖి సన్నివేశాల ఎలా ఉంటాయో అని బాలీవుడ్ ప్రేక్షకులు ఉత్సాహాపడుతున్నారు. యానిమల్ మొదటి భాగంలో, బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించారు.

మూగ విలన్ గా బాబీ నటన ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా రణబీర్ తో క్లైమాక్స్ ఫైట్ లో పోటాపోటీగా నటించి ప్రశంసలను అందుకున్నారు. మరిప్పుడు సీక్వెల్ లో విక్కీ కౌశల్ నటిస్తే అంతే బలంగా తన ముద్ర వేయగలరా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విక్కీ కౌశల్ నటించిన ‘సామ్ బహదూర్’ 2023 డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద రణబీర్ కపూర్ ‘యానిమల్’ పాటే థియేటర్లలో విడుదలయింది. యానిమల్ భారీ బ్లాక్ అవగా… సామ్ బహదూర్ కూడా మంచి హిట్ అనిపించుకుంది. రివ్యూల పరంగా యానిమల్ సినిమాకి కాస్త విమర్శలు వచ్చినా… నటన పరంగా అటు రణబీర్ ఇటు విక్కీ కౌశల్ లకు ప్రశంసలు లభించాయి.

2023 డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ సరైన బంధం లేని తండ్రీ కొడుకుల కథని చూపించింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ తన తండ్రిని (అనిల్ కపూర్) రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళే కొడుకుగా నటించాడు. ఇక సీక్వెల్ లో హీరోకీ అచ్చం తనలానే ఉండే సోదరుడికి మధ్య జరిగే యుద్ధమే ప్రథానంగా ఉంటుంది. మరి యానిమల్ పార్క్ లో విక్కీ కౌశల్ విలన్ గా నటిస్తారా లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

Show comments