టీవీలోకి వచ్చేస్తున్న సైంధవ్.. ఏ ఛానెల్లో అంటే..

టీవీలోకి వచ్చేస్తున్న సైంధవ్.. ఏ ఛానెల్లో అంటే..

Saindhav movie: సంక్రాతి కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్ సినిమా ఇటీవలే ఓటీటీలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఇంతకి ఎప్పుడంటే..

Saindhav movie: సంక్రాతి కానుకగా విడుదలైన విక్టరీ వెంకటేష్ సినిమా ఇటీవలే ఓటీటీలో సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఇంతకి ఎప్పుడంటే..

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవలే నటించిన చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాను హిట్ ఫేమ్ శైలష్ కొలను దర్శకత్వం వహించగా.. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఫ్యామిలీ హీరో వెంకటేష్ సినిమా కావడంతో.. సినిమా పై ప్రేక్షకులకు భారీ అంచనాలు మొదలయ్యాయి. దీంతో పండగ సీజన్ కావడంతో థియేటర్లలో సైంధవ్ మూవీకి జనలు తరలి వెళ్లారు. కానీ, యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైయింది. దీంతో సినిమా విడుదలై నెల రోజులు గడవకముందే ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఇప్పుడు ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో టీవీలో ప్రసారం చేయాలని చూస్తున్నారు. ఇంతకి ఎప్పుడంటే..

విక్టరీ వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. దీంతో ఈ సినిమా అంతగా కలెక్షన్స్ ను రాబెట్టుకో లేకపోయింది. అయితే నటన పరంగా వెంకీకి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఇక థియేటర్లలో మెప్పించలేని ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 15 కోట్లకు ఓటీటీ హక్కులను కొనుగోలు చేసుకుంది. ఈ క్రమంలోనే మూవీ విడుదలై నెలరోజులు గడవకముందే గతనెల ఫిబ్రవరి 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. కానీ, ఓటీటీలో కూడా ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోవడంతో ఇప్పుడు ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయనున్నారు. కాగా, సైంధవ్ మూవీని శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకుంది. ఇక ఈ సినిమాను మార్చి 17, సాయంత్రం 6 గంటలకు టీవీలో టెలికాస్ట్ చేయనున్నారు. ఇక సంక్రాతికి విడుదలైన ఈ సినిమా కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక భారీ నష్టాలను చవి చూసిన సినిమాగా నిలిచిపోయింది.

ఇక సైంధవ్ సినిమాలో పాపాకు అరుదైన వ్యాధి రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట తో ట్రైలర్ చూస్తే మంచి ఆసక్తిని రేపింది. కానీ, సినిమా మాత్రం ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇందులో విపరీతమైన హింస ఎవరికీ మింగుడు పడలేదు. దీంతో సైంధవ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాగా, ఈ సినిమాలో వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్ తో పాటు రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆండ్రియా జెర్మియా , ముకేశ్ రిషి , బేబీ సారా తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి.. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించగా.. సంతోష్ నారయణన్ సంగీతాన్ని అందించాడు. ఇక సాదాసీదా లైఫ్ ని లీడ్ చేసే హీరోకు పవర్ ఫుల్ ప్లాష్ బ్యాక్ ఉండటం అనే పాయింట్ తో ఫ్యాక్షన్, మాఫియా , గ్యాంగ్ స్టార్స్ ఇలా అన్ని జోనర్ లో ఇది వరకే చాలా  సినిమాలు వచ్చాయి. అయితే మళ్లీ అదే పాయింట్ ను శైలేష్ తెరకెక్కించినట్లు అనిపించడంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా మెప్పించలేకపోయింది. మరి, ఇంకొన్ని రోజుల్లో సైంధవ్ మూవీ టీవీలో ప్రసారం కాబోతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments