‘వి’ లో ఏదో విషయముంది

‘వి’ లో ఏదో విషయముంది

న్యాచురల్ స్టార్ నాని-సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన వి టీజర్ ని ఇవాళ విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేసిన నాని దీని గురించి ముందు నుంచి ఊరిస్తూనే ఉన్నాడు. దానికి తగ్గట్టే టీజర్ లోని కంటెంట్ ఏదో గట్టి విషయముందనే హామీ ఇస్తోంది. ఇక విషయానికి వస్తే అంతు చిక్కని రీతిలో దారుణ హత్యలు చేస్తుంటాడు వి(నాని). అతన్ని పట్టుకునే లక్ష్యంతో ఉంటాడు ఓ పోలీస్ ఆఫీసర్(సుధీర్ బాబు). కాని ఈ దాగుడుమూతల ప్రమాదకరమైన ఆటలో వి దొరక్కుండా చట్టానికి సవాల్ విసురుతూ ఉంటాడు. మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. వి చిక్కినట్టే చిక్కి జారిపోతూ ఉంటాడు. మరి ఈ గేమ్ లో ఎవరు విన్నరో తేలేది మార్చ్ 25నే. నాని చాలా రోజుల తర్వాత డిఫరెంట్ జానర్ లో మూవీ చేశాడు.

కిల్లర్ వెనుక ఏదో కారణం ఉంటుందని తెలుస్తున్నప్పటికీ మంచి ఇంటెన్సిటితో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దీన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి టెంపోని క్రియేట్ చేస్తోంది. సుధీర్ బాబు గత సినిమాల కన్నా స్టైలిష్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఒక్క షాట్ లో నివేదా థామస్ ని చూపించారు కాని ఇంకో హీరొయిన్ ఆదితి రావు హైదరిని దాచిపెట్టారు. సోదాపి దమ్ముంటే నన్నాపు, వెయిట్ చేయడానికి నేను నీ ఫ్యాన్ కాదు లాంటి డైలగ్స్ పేలాయి. మొత్తానికి అంచనాలు అందుకునేలా ఉన్న వి టీజర్ ఆసక్తి రేపడంలో సక్సెస్ అయ్యింది. ట్రైలర్ వస్తే ఇది ఇంకా రెట్టింపయ్యేలా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన వి వచ్చే నెల 25న విడుదల కానుంది.

Teaser Link Here @ bit.ly/2SCOhKx

Show comments