Central govt: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!

ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో శాలరీలు భారీగా పెరగనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో శాలరీలు భారీగా పెరగనున్నాయి.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండేది ఉద్యోగులు మాత్రమే. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా, సక్రమంగా అమలు కావాలన్నా ఉద్యోగుల పాత్ర కీలకం. అటు కేంద్రంలో.. ఇటు రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులే కీలకం. మరి గవర్నమెంట్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వాలు అండగా నిలుస్తుంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 46 శాతం నుంచి 50 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెన్షనర్‌లకు చెల్లించాల్సిన డియర్‌నెస్ రిలీఫ్(డీఆర్)లను 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది. అంతేకాకుండా వాహన భత్యం, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ మొదలైన అలవెన్సులు 25 శాతం పెంచనున్నారు. 7 వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం హెచ్ఆర్ఏ అనేది క్లాస్ ఎక్స్ సిటీలో 27%, క్లాస్ వై సిటీలో 18% శాతం, క్లాస్ జెడ్ సిటీలో 9% నుండి వరుసగా 30%, 20%, 10%కి పెంచారు. అలాగే గ్రాట్యుటీ పరిమితిని 25% పెంచారు. ప్రభుత్వ నిర్ణయంతో కోటి మంది పెన్షనర్లు, ఉద్యోగులకు లబ్ధి చూకూరనున్నది.

Show comments