Union Budget 2024--Tax Rates: రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు.. ఇన్‌కమ్ ట్యాక్స్‌పై కీలక ప్రకటన

Budget 2024 Analysis: రూ.7 లక్షల వరకూ పన్ను మినహాయింపు.. ఇన్‌కమ్ ట్యాక్స్‌పై కీలక ప్రకటన

Union Budget 2024 Highlights & Analysis in Telugu: నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పన్ను చెల్లింపులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

Union Budget 2024 Highlights & Analysis in Telugu: నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పన్ను చెల్లింపులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1, గురువారం నాడు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పన్ను చెల్లింపుదారులకు నిరాశే మిగిల్చారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్‌లో పన్ను రేట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో పన్ను రేట్లు యథాతథంగా ఉంటాయి. అంతేకాక కొత్త ట్యాక్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్‌. ఆదాయపు పన్నుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవివరాలు..

ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి 7 లక్షల రూపాయల వరకు ఉంది. దీని వల్ల సంవత్సరానికి రూ.7లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మధ్యంతర బడ్జెట్‌లో దీన్ని 8 లక్షల రూపాయల వరకు పెంచుతారని భావించారు. కానీ దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో సామాన్యులకు నిరాశే మిగిలింది.

పన్నుల శ్లాబులు యథాతథంగా ఉంటాయని వెల్లడించారు నిర్మలా సీతారామన్‌. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. అంతేకాక కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించామని చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రస్తుతం ఉన్న కొత్త పన్ను విధానంలో 5 రకాల శ్లాబులు ఉన్నాయి. అలానే పన్ను రేట్లను కూడా గతేడాది గణనీయంగా తగ్గించారు.

ఏడాదికి రూ.3 లక్షల ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3-5 లక్షల ఆదాయం ఉన్న వారు ఏడాదికి 5 శాతం పన్ను, 6-9 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వారు 10 శాతం పన్ను, 12-185 లక్షలు ఉన్న వారు 20 శాతం పన్ను రేటు విధించారు. అయితే ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట కలిగించేలదు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘ట్యాక్స్‌పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. జీఎస్‌టీ విధానం ప్రయోజనకరంగా ఉందని.. 94 శాతం మంది పారిశ్రామిక ప్రముఖలు చెప్పారని వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించిన వారికి రీఫండ్స్‌ను వేగవంతం చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాక సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మరి ఈ పన్ను విధానంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments