Udyogini Scheme Details: ఈ వ్యాపారాలు చేసేవారికి కేంద్రం 3 లక్షల లోన్..మీకూ వస్తుందా ? రాదా? చెక్ చేసుకోండి

ఈ వ్యాపారాలు చేసేవారికి కేంద్రం 3 లక్షల లోన్..మీకూ వస్తుందా ? రాదా? చెక్ చేసుకోండి

Udyogini Scheme Details: ఒక మహిళ అభ్యున్నతి సాధిస్తే.. ఆమె కుటుంబం బాగుపడుతుంది.. తద్వారా సమాజం ముందుకు సాగుతుంది. ఇప్పుడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు.

Udyogini Scheme Details: ఒక మహిళ అభ్యున్నతి సాధిస్తే.. ఆమె కుటుంబం బాగుపడుతుంది.. తద్వారా సమాజం ముందుకు సాగుతుంది. ఇప్పుడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు.

పేద ప్రజల అభ్యున్నతికి కేంద్రం ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చింది. దేశంలో ఇప్పుడు మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. రాజకీయ, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు కేంద్రం ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. 88 రకాల వ్యాపారాలు చేసే వారికి రూ.3 లక్షల చొప్పున డబ్బు ఇస్తుంది. ఈ పథకం పేరు ‘ఉద్యోగిని పథకం’. పేరుకు ఉద్యోగిని పథకం అయినా.. ఇందులో వ్యాపారం చేసుకునే పేద మహిళల కోసం ప్రవేశ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా నిర్వహిస్తుంది. ఈ పథకం పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

కేంద్రం ఇప్పటి వరకు మహిళాభివృద్ది కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకువచ్చింది. మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ‘ఉద్యోగిని’ అనే పథకాన్ని అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా గ్యారంటీ లేకుండా రూ. 3 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఇస్తున్నారు.88 రకాల వ్యాపారాలు చేసేవారికి ఈ పథకం అమల్లోకి వస్తుంది. మహిళ అభ్యున్నతి సాధిస్తే.. ఆ కుటుంబం బాగుపడుతుంది. అందుకే మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందజేసి.. ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాయి. మహిళలకు రుణాలు ఇస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నాయి.

ఉద్యోగిని పథకం :

దేశంలోని మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన పథకమే ‘ఉద్యోగిని పథకం’. ఈ పథకం పేరు ఉద్యోగిని పథకమే అయినా.. వ్యాపారం చేసుకునే వారి కోసం ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఉమెన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా మూడు లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తారు. ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజు తీసుకోవు. ఈ రుణం పట్టణాల్లో కంటే.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ రుణం పొందవొచ్చు. ఈ డబ్బు కేంద్రం ఉచితంగా ఇవ్వదు.. వడ్డీ లేని రుణంగా ఇస్తుంది. ఆ డబ్బుతో వ్యాపారం చేసి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళా రైతులు కూడా ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో వడ్డీ లేని రుణం పొందవొచ్చు.

ఎవరు అర్హులు :

ఉద్యోగిని పథకం కింద లోన్ పొందాలనుకునే వారికి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.1.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలు, దివ్యాంగులైన మహిళలకు కుటుంబ ఆదాయానికి ఎలాంటి పరిమితులు లేవు. ఈ రుణం ఇచ్చేటపుడు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మహిళల వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవొచ్చు.అప్పటికే ఏదైనా వ్యాపారం చేసే మహిళలు ఈ లోన్ పొందేందుకు అర్హులు. గతంలో ఏవైనా లోన్లు తీసుకున్నట్లయితే తగిన గడువులో చెల్లించి ఉండాలి.

లోన్ పొందేందుకు కావాల్సిన పత్రాలు :

ఉద్యోగిని పథకం కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైపు ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, కుటు ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ తో పాటు బ్యాంక్ ఇతర ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే అవి సమర్పించాల్సి ఉంటుంది.

లోన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి :

ఉద్యోగిని పథకం లోన్ పొందాలనుకునే మహిళలుల.. తమ దగ్గరల్లోని బ్యాంకుకు వెళ్లి అక్కడ సిబ్బందిని సంప్రదించాలి. వారు అడిగిన పత్రాలు సమర్పించాలి. వాటిని సమర్పించేందుకు ఒక ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేయాలి.. తర్వాత వాటిని అధికారులు పరిశీలించి లోన్ ఇస్తారు. లేదంటే బ్యాంకుల అధికారిక వెబ్ సైట్లలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

 

Show comments