U19 Cricket World Cup India vs South Africa Semies: చరిత్ర సృష్టించిన అండర్-19 టీమ్.. వరల్డ్ కప్ సెమీస్​లో ఘన విజయం

U19 Cricket World Cup: చరిత్ర సృష్టించిన అండర్-19 టీమ్.. వరల్డ్ కప్ సెమీస్​లో ఘన విజయం

భారత అండర్-19 టీమ్ చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది టీమిండియా అభిమానులు గర్వపడేలా చేసింది.

భారత అండర్-19 టీమ్ చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది టీమిండియా అభిమానులు గర్వపడేలా చేసింది.

భారత కుర్రాళ్లు అద్భుతం చేశారు. అండర్-19 వరల్డ్ కప్​లో సత్తా చాటారు. వరుసగా ఐదోసారి మెగాటోర్నీలో ఫైనల్స్​కు చేరుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీఫైనల్​లో సౌతాఫ్రికాను 3 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. ఆ జట్టు విసిరిన 245 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో మన టీమ్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. 34 పరుగులకే నలుగురు కీలక బ్యాటర్లు ఔటయ్యారు. దీంతో గెలుపు మీద అందరూ ఆశలు వదులుకున్నారు. ఆ దశలో జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ (81), సచిన్ దాస్ (96) వీరోచితంగా పోరాడారు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్​ను భారత్ వైపు తిప్పారు.

సెమీస్​లో ముందుగా బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ఆ టీమ్​లో ప్రిటోరియస్ 76 పరుగులతో టాప్ స్కోరర్​గా నిలిచాడు. రిచర్డ్ సెలెట్స్​వేన్ (64) కూడా రాణించాడు. భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3 వికెట్లు తీయగా.. ముషీర్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. నమన్ తివారీ, సౌమ్యకుమార్ పాండేకు ఒక్కో వికెట్ దక్కింది. మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేయలేకపోయింది. ఆ తర్వాత ఛేదనలో అందరు కీలక బ్యాటర్లు ఔటైనా.. సారథి ఉదయ్, సచిన్ దాస్ టీమ్​ను ఆదుకున్నారు. ఆఖర్లో లింబానీ విన్నింగ్ షాట్ కొట్టి మ్యాచ్​ను ఫినిష్ చేశాడు. మరి.. అండర్-19 వరల్డ్ కప్​లో భారత్ ఫైనల్​కు చేరుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments