తల్లిదండ్రులు లేని అనాథ.. హోటల్ లో పని చేస్తూ.. ఇంటర్ ఫలితాల్లో టాపర్ !

తల్లిదండ్రులు లేని అనాథ.. హోటల్ లో పని చేస్తూ.. ఇంటర్ ఫలితాల్లో టాపర్ !

పట్టుదలతో శ్రమించే వారి వెనుక విజయమే పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయి, పేదరికంతో అల్లాడుతున్నా ఆ కష్టాలను దిగమింగుకుని విజేతగా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. అనాథగా ఉన్న ఓ యువకుడు కష్టాలను ఎదిరించి.. ఇంటర్ లో టాపర్ గా నిలిచాడు.

పట్టుదలతో శ్రమించే వారి వెనుక విజయమే పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయి, పేదరికంతో అల్లాడుతున్నా ఆ కష్టాలను దిగమింగుకుని విజేతగా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. అనాథగా ఉన్న ఓ యువకుడు కష్టాలను ఎదిరించి.. ఇంటర్ లో టాపర్ గా నిలిచాడు.

ఏదైనా సాధించాలంటే మనిషికి ప్రధానంగా ఉండాల్సింది తపన. నిరంతరం లక్ష్యాన్ని సాధించాలనే కసి, తపన మనిషిలో ఉండాలి. నిద్రపోయినా సరే కళ్లముందు గమ్యమే కనిపించాలి. అలా పట్టుదలతో శ్రమించే వారి వెనుక విజయమే పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులను కోల్పోయి, పేదరికంతో అల్లాడుతున్నా ఆ కష్టాలను దిగమింగుకుని విజయ తీరాలకు చేరిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో తూర్పుగోదావరికి చెందిన ఓ యువకుడు ఉన్నాడు. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఫలితాల్లో చాలా మంది విద్యార్థులు  అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇలా మంచి మార్కులు సాధించిన కొందరి విద్యార్థుల కుటుంబ నేపథ్యం చూస్తే జాలి వేస్తుంది. ఆ విషయం పక్కన పెడితే.. సమస్యలతో  పోరాటం చేసి.. టాపర్లలుగా నిలిచిన వారు..ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి వారిలో తూర్పుగొదావరి జిల్లాకు చెందిన పల్లె జాన్ ఒకరు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా తుని పట్టణంలో చారిత్రక గుర్తింపు కలిగిన రాజా కాలేజీలో పల్లె జాన్ యువకుడు ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 918 మార్కులు సాధించాడు. అంతేకాక కాకినాడ జిల్లా ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల్లో జాన్ టాపర్‌గా నిలిచాడు. ఇతంటి విజయం అందుకున్న ఎంతో విషాదం దాగి ఉంది.

జాన్  చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. దీంతో అతడి పెద్దమ్మ చేరదీసి పెంచింది. చదువుకునే స్థోమత లేకపోవడంతో హాస్టల్లో ఉంటూ పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత చదువును మానేసి అక్కడ జాతీయ రహదారిపై ఉన్నహెవిలీ దాబాలో పనికి చేరాడు. ఆ సమయంలో జాన్ చేతి రాతను చూసిన హోటల్ యజమాని. అతడి గురించి ఆరా తీశాడు. పేదరికంతో చదువు మానేసి.. ఇలా కూలీ పని చేస్తున్నాడనే విషయం తెలిసి చలించిపోయాడు. జాన్ ప్రతిభపై అపారమ నమ్మకం ఉన్న ఆ  హోటల్ యజమాని చాలా రిస్క్ తీసుకున్నారు. అప్పటికే అడ్మిషన్లు సమయం ముగిసినా.. తనకున్న పరిచయాలతో జాన్‌ను రాజా కాలేజీ చేర్పించాడు.

ఇక ఆ హోటల్ యజమాని సహకారంతో  పూట దాబాలో పని చేస్తూ.. కాలేజీకి వెళ్లి చదువుకున్నాడు. తన పెద్దమ్మ, అలానే  దాబా యజమాని తనపై పెట్టుకున్ననమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుకున్నాడు. అందుకే రేయింబవళ్లు కష్టపడి చదివాడు. తాజాగా, విడుదలైన ఇంటర్ ఫలితాల్లో జాన్ 918 మార్కులు సాధించాడు. ఇలా పేదరికంతో ఇబ్బంది పడుతూనే జిల్లా టాపర్ గా నిలిచిన జాన్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నవారు లేకపోయినా కష్టాలు ఓర్చి దాబాలో పనిచేస్తూ చదువుల్లో రాణించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరూ ఉండి,  లక్షల డబ్బులు పోసి ప్రవైటు కాలేజీల్లో చదివిస్తే..నిర్లక్ష్యంగా ఉండే ఎందరో జాన్ ను చూసైన మారాలంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిరుపేద మాతం ఓవైపు పనిచేస్తూ.. చదువును కొనసాగించి కాలేజ్ టాపర్‌గా నిలిచాడు. ఉన్నత చదువుల చదివేందుకు దాతలు సాయం అందిస్తే మరింత బాగా చదువుతానని జాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. మరి..ఈ మట్టిలో మాణిక్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments