Rs 500 Gas Cylinder-Ration, Aadhaar Card: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఈ రెండు పత్రాలు ఉంటేనే..

Gas Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఈ రెండు పత్రాలు ఉంటేనే..

వారం రోజుల్లోగా 500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రీ కరెంట్‌ హామీలు అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు పత్రాలుంటేనే.. గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. అవి ఏవంటే..

వారం రోజుల్లోగా 500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రీ కరెంట్‌ హామీలు అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు పత్రాలుంటేనే.. గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వనున్నారు. అవి ఏవంటే..

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వాటిని అమలు చేస్తానని చెప్పింది. వాటిల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుండగా.. మరో వారం రోజుల్లో ఫ్రీ కరెంట్‌, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ హామీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి మండలంలో బుధవారం పర్యటించిన సీఎం.. రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ కరెంట్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లోగా ఈ రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటన నేపథ్యంలో అర్హులైనవారికి రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వారం రోజుల్లోనే ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో.. అందుకు మార్గదర్శకాలు రూపిందించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇక ఈపథకం పొందాలనుకువారికి రెండు పత్రాలు కచ్చితంగా ఉండాలి. అవి రేషన్‌కార్డు, ఆధార్ కార్డు.

ఈ రెండు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా.. వీరిలో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్‌ వాడుతున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు. ఇక రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అమలును రేషన్‌కార్డున్న వారికే అమలు చేస్తే.. ఈ శాతం మరింత తగ్గుతుంది అంటున్నారు అధికారులు. ఇక గ్యాస్‌ పథకానికి రేషన్, ఆధార్ కార్డులు తప్పనిసరి అని చెప్పటంతో.. రేషన్ కార్డులు ఉండి ఆధార్ కార్డులు లేనివారు ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

ఇక రేషన్ కార్డులు లేని పేదలకు వాటిని మంజూరు చేసిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. సిలిండర్ పథకం అమలుకు మూడేళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వారం రోజుల్లోగా ఫ్రీ కరెంట్‌, గ్యాస్‌ సిలిండర్‌ హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments