TS Elections 2023 EC New Voter Card Application: తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. కొత్త ఓటర్‌ కార్డు దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ ప్రజలకు అలర్ట్‌.. కొత్త ఓటర్‌ కార్డు దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈసీ కొత్త అలర్ట్‌ జారీ చేసింద. కొత్త ఓటర్‌ కార్డు దరఖాస్తుకు గడువు పెంచింది. ఆ వివరాలు..

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఈసీ కొత్త అలర్ట్‌ జారీ చేసింద. కొత్త ఓటర్‌ కార్డు దరఖాస్తుకు గడువు పెంచింది. ఆ వివరాలు..

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతుంది. పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాయి. అభ్యర్థులంతా ఊరూరా తిరుగుతూ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లీజ్‌ ఒక్కసారి గెలిపించండి అని జనాలను బతిమిలాడుకుంటున్నారు. ఓవైపు పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంటే.. మరోవైపు ఎన్నికల కమిషన్‌.. ఎలక్షన్‌ నిర్వహణకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఓటుకు అప్లై చేసుకునే వారికి మరో అవకాశం ఇచ్చింది. కొత్త ఓటరు కార్డు దరఖాస్తుకు గడువు పెంచింది. ఆ వివరాలు..

అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత.. ఈసీ ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అక్టోబర్‌ 31 వరకు అవకాశం ఇచ్చింది. దాంతో చాలా మంది కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకున్నారు. కానీ కొంత మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. ఈ క్రమంలో అలాంటి వారికి మరో అవకాశం కల్పించింది. కొత్త ఓటర్‌ కార్డు దరఖాస్తు గడువును నవంబరు 10 వ తేదీ వరకు పెంచింది. అక్టోబర్‌ 31 వరకు రాష్ట్రంలో కొత్తగా 4.71 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని అధికారులు పేర్కొన్నారు. గడువు పెంచడంతో.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఓటర్ దరఖాస్తు ప్రక్రియకు భారీ ఎత్తున స్పందన వచ్చింది. అక్టోబర్‌‌ 1-31 మధ్య రాష్ట్రంలో 4.71 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నుంచే అత్యధికంగా లక్షకు పైగా కొత్త ఓటర్లు ఉన్నారని ఈసీ పేర్కొంంది. ఓటర్‌ దరఖాస్తుకు భారీ స్పందన రావడంతో.. మరో పది రోజుల పాటు గడువు పెంచారు. నవంబరు పదో తేదీ వరకు ఆన్​‌లైన్‌లో ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఈసీ. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం ఓటర్లలో 1.59 కోట్ల మంది పురుషులు, 1.58 కోట్ల మంది మహిళలు, 2,583 మంది ఇతరులు ఉన్నారు.

Show comments