Travis Head- Nitish Reddy- Chahal: చాహల్ ఓవర్లో హెడ్- నితీశ్ విధ్వంసం.. ఇదేం మాస్ కొట్టుడు సామీ..

చాహల్ ఓవర్లో హెడ్- నితీశ్ విధ్వంసం.. ఇదేం మాస్ కొట్టుడు సామీ..

Travis Head- Nitish Reddy- Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా చాహల్ కు పీడకలను అందించారు.

Travis Head- Nitish Reddy- Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా చాహల్ కు పీడకలను అందించారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ గాడిలో పడినట్లు కనిపిస్తోంది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ తో హైదరాబాద్ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్డ విధ్వంసం సృష్టించాడు. గత రెండు మ్యాచుల్లో విఫలమైన హెడ్.. మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. కాస్త స్లోగా స్టార్ట్ చేసిన హైదరాబాద్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. పరుగుల కోసం సతమతమవుతున్న తరుణంలో ట్రావిస్ హెడ్ రాజస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడు. ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్ ఓవర్లో హెడ్ మినీ సునామీని చూపించాడు. అప్పటి వరకు ఓవర్ కి 4 పరుగులు వస్తుంటే.. ఒక్కసారిగా స్కోర్ కార్డుని దూసుకెళ్లేలా చేశాడు.

ఉప్పల్ వేదికగా రాజస్థాన్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఉప్పల్ అనగానే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెలరేగుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఈ మ్యాచ్ లో ఆ సీన్ కాస్త రివర్స్ అయ్యింది. పవర్ ప్లేలో ఈ సీజన్ కే అత్యల్ప స్కోర్(37/2)ని నమోదు చేసింది. 10 ఓవర్లకు కనీసం 60 పరుగులు కూడా చేస్తారో లేదో అని అభిమానులు కంగారు పడుతున్నారు. కానీ, అప్పుడే ట్రావిస్ హెడ్ విధ్వంసం షురూ చేశాడు. ఇంకేముంది అభిమానుల ముఖాల్లో జోష్.. రాజస్థాన్ బౌలర్ల ముఖాల్లో నిరుత్సాహం కనిపించింది. ఈ మ్యాచ్ లో అర్ధ శతకంతో చెలరేగిన ట్రావిస్ హెడ్(58).. చాహల్ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండిరీలతో విజృంభించాడు.

యుజ్వేంద్ర చాహల్ కు ట్రావిస్ హెడ్ పీడకలను అందించాడు. అప్పటి వరకు స్లో బ్యాటింగ్ చేసిన ట్రావిస్ హెడ్ ఒక్కసారిగా జూలు విదిల్చాడు. చాహల్ ఓవర్లో ఫస్ట్ బాల్ కే లైఫ్ దక్కించుకున్న హెడ్.. ఆ తర్వాత విజృంభించాడు. ఆఖరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదేశాడు. అప్పటి వరకు ఓవర్ 10లోపే వస్తున్న పరుగులు ఏకంగా 18కి చేరాయి. ఇంకేముంది హైదరాబాద్ అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. మరోవైపు నితీశ్ రెడ్డి కూడా చాహల్ ఓవర్లో ఇరగదీశాడు. అసలు సిసలు హిట్టింగ్ అంటే ఏంటో చూపించాడు. ఈసారి ఏకంగా ఒకే ఓవర్లో 21 పరుగులు వచ్చేశాయి. 6, 4, 6, 4తో అదరగొట్టాడు. మొత్తానికి చాహల్ కు ట్రావిస్ హెడ్- నితీశ్ రెడ్డి అసలు సిసలు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించేశారు. మరి.. చాహల్ ఓవర్లో ఇరగదీసిన ట్రావిస్ హెడ్- నితీశ్ రెడ్డిలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments