Anweshippin Kandethum Telugu Version OTT: మలయాళంలో బ్లాక్​బస్టర్ మూవీ.. ఆ OTTలో తెలుగులోకి..!

మలయాళంలో బ్లాక్​బస్టర్ మూవీ.. ఆ OTTలో తెలుగులోకి..!

మలయాళంలో బ్లాక్​బస్టర్​గా నిలిచిన ఓ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. దాని వివరాలు ఇప్పుడు మీ కోసం..

మలయాళంలో బ్లాక్​బస్టర్​గా నిలిచిన ఓ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది. దాని వివరాలు ఇప్పుడు మీ కోసం..

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. థియేటర్​లో హిట్ టాక్ వచ్చిన సినిమాలను తప్ప యావరేజ్ మూవీస్​ను చూడటానికి ఆడియెన్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. బిగ్ స్క్రీన్స్​లో రిలీజై బ్లాక్​బస్టర్స్​గా నిలిచిన మూవీస్ కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్స్​కు ఓటీటీల్లో మస్త్ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ తరహా చిత్రాలు ఎక్కువగా మలయాళ చిత్ర పరిశ్రమలోనే తెరకెక్కుతుంటాయి. చిన్న అంశాన్ని తీసుకొని బ్యూటిఫుల్​గా కథను అల్లుకొని అంతే అందంగా సినిమాలను తీసే మాలీవుడ్ నుంచి మరో థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. గత నెలలో బిగ్ స్క్రీన్స్​లో రిలీజైన ఈ ఫిల్మ్ టెర్రిఫిక్ రెస్పాన్స్ అందుకుంది. దీని గురించి తెలుగు ప్రేక్షకులు కూడా మాట్లాడుకున్నారు. ఆ మూవీనే ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’.

రీసెంట్ మలయాళ బ్లాక్​బస్టర్ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. తెలుగులోనూ స్ట్రీమింగ్​కు వచ్చేస్తోందీ చిత్రం. మాలీవుడ్​ స్టార్ టొవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా సంచలన వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేసింది. పరువు హత్యలతో చాలా చిత్రాలు వచ్చినప్పటికీ అందులో ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ స్పెషల్​గా నిలిచింది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన టొవినో ఫిల్మ్.. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్​తో 90ల నేపథ్యంలో సాగే స్టోరీతో దీన్ని రూపొందించారు. ఈ మూవీలోని థ్రిల్లింగ్ ఎలిమెట్స్, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఆడియెన్స్​ను తెగ ఆకట్టుకున్నాయి. కథ విషయానికొస్తే.. ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సబ్​ ఇన్​స్పెక్టర్. హాట్ టికెట్ కోసం కాలేజ్​కు వెళ్లిన లవ్​లీ అనే అమ్మాయి అదృశ్యమవుతుంది.

లవ్​లీ కేసును ఆనంద్​ నారాయణన్​కు అప్పగిస్తుంది పోలీసు శాఖ. ఈ ఇన్వెస్టిగేషన్​లో భాగంగా ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తారు. అనంతరం కొన్నాళ్లకు మరో కేసు. ఇది ఒక అమ్మాయి పరువు హత్య కేసు. ఇలా రెండు వేర్వేరు కేసులను ఆనంద్ తన టీమ్​తో కలసి ఎలా పరిష్కరించాడు? ఆఖరికి ఏమైందనేది ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ సినిమా స్టోరీ. మలయాళంలో బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన ఈ ఫిల్మ్​ను నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 8వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్​ను అందుబాటులోకి రానుందని అధికారికంగా వెల్లడించారు. ఈ మధ్య ఓటీటీలో సరైన సస్పెన్స్ థ్రిల్లర్స్ రాలేదు. కాబట్టి ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ తెలుగు ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి.. మలయాళ హిట్ ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’ స్ట్రీమింగ్​ కోసం మీరెంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌.. అంపైర్‌ సైతం చప్పట్లు కొట్టాడు!

Show comments